Maoist Top Commanders: దేశంలో ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల త్రి-రాష్ట్ర సరిహద్దులో జరుగుతున్న ఒక ప్రధాన ఆపరేషన్‌లో నక్సల్ ఫ్రంట్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్ర కమాండర్ మాద్వి హిడ్మాను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి. హిడ్మా ఎన్‌కౌంటర్‌తో భద్రతా బలగాలు మిగిలిన అగ్ర నక్సలైట్లలో భయాందోళనలను విజయవంతం సృష్టించాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పుడు మావోయిస్టు పార్టీలో బతికి ఉన్న టాప్ కమాండర్లపై భద్రతా దళాలు ప్రత్యేక దృష్టిసారించాయి. ఈ స్టోరీలో మావోయిస్టు పార్టీలో మిగిలిన టాప్ కమాండర్ల గురించి తెలుసుకుందాం.
READ ALSO: Bihar: ‘‘హోం శాఖ’’పైనే చిక్కుముడి.. బీజేపీ-జేడీయూ మధ్య పవర్ షేరింగ్..
పార్టీకి బలమైన స్తంభాలు..
దేశంలో మావోయిస్టు పార్టీకి ఈ కమాండర్లను బలమైన స్తంభాలుగా పరిగణిస్తారు. అడవిలో కార్యకలాపాలు, లాజిస్టిక్స్, స్థానిక నెట్‌వర్క్‌లను నిర్వహించడం వంటి వాటికి వీళ్లు బాధ్యత వహిస్తున్నారు. హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత, నక్సలైట్ సంస్థ మొత్తం నిర్మాణం కూలిపోవడం ప్రారంభించిందని నిపుణులు అంటున్నారు. మొదట లాజిస్టిక్స్ లైన్లు దెబ్బతిన్నాయి, ఇప్పుడు రక్షిత అటవీ మండలాలు కూడా పరిమితం అయ్యాయని అంటున్నారు. అనేక ప్రాంతాలలో మావోయిస్టులకు స్థానికల నుంచి మద్దతు తగ్గిపోతోందని చెబుతున్నారు. డ్రోన్ నిఘా, ట్రాకింగ్ కారణంగా ఈ టాప్ కమాండర్లు దాక్కోవడం కష్టతరం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
మావోయిస్టుల ఉనికిపై పట్టు బిగించిన భద్రతా దళాలు..
మావోయిస్టుల ఉనికిపై పట్టు బిగించడానికి భద్రతా దళాలు తమ వ్యూహాన్ని మూడు భాగాలుగా విభజించుకున్నాయి. మొదటిది.. అగ్రశ్రేణి నక్సలైట్ కమాండర్లను వారి నెట్‌వర్క్‌లు, సహాయక వ్యవస్థల నుంచి వేరుచేయడం. రెండవది లాజిస్టికల్ సామగ్రిని పూర్తిగా నిలిపివేయడం, మూడవది సంస్థ అటవీ ఆధారిత మౌలిక సదుపాయాలను నాశనం చేయడం. ఈ వ్యూహాన్ని అమలు చేయడానికి కేంద్రం ప్రత్యేక బృందాలను మోహరించింది. అలాగే సరిహద్దు జిల్లాల్లో భద్రతా దళాలు నిరంతర కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. దీంతో మావోయిస్టుల ఉనికిపై భద్రతా దళాలు పట్టు బిగించినట్లు అయ్యిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. తాజా హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత మిగిలిన నక్సలైట్ నాయకులకు కూడా భద్రతా దళాలు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో వాళ్లు భద్రతా దళాలకు లొంగిపోయే అవకాశం కల్పిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈక్రమంలో మావోయిస్టు పార్టీ కమాండర్లకు లొంగిపోయే అవకాశం కూడా కల్పిస్తున్న పలు నివేదికలు పేర్కొన్నాయి. ఒక వేళ వారు ఈ దీనిని సద్వినియోగం చేసుకోకపోతే వారిపై కఠిన చర్యలు తప్పని భద్రతా దళాలు స్పష్టం చేశాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం 2026 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలనే ప్రభుత్వం ప్రకటన ఇప్పుడు వాస్తవమవుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.
మావోయిస్టు పార్టీలో టాప్ కమాండర్లు..
మావోయిస్టు పార్టీలో టాప్ కమాండర్‌గా పరిగణించబడిన హిడ్మా మరణం మిగిలిన కమాండర్లపై ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అలాగే పార్టీలో మిగిలిన టాప్ కమాండర్లు బాపరావు, గణపతి, దేవ బర్సే, ఇతరులు ఎంతకాలం భద్రతా సంస్థల ఒత్తిడిని తట్టుకోగలరనేది కీలకంగా మారింది. ఈ సందర్భంగా పలువురు విశ్లేషకులు మాట్లాడుతూ.. ఇకపై వారికి అడవి ఏమాత్రం సురక్షితమైన స్వర్గధామం కాదని అన్నారు. భద్రతా దళాల ముట్టడి పెరుగుతుండటంతో వారి బలం తగ్గిపోతోంది. రాబోయే నెలల్లో కేంద్రం నక్సలైట్ నాయకత్వంపై నిర్ణయాత్మక చర్య తీసుకునే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వెల్లడించారు.
మిగిలిన టాప్ కమాండర్లు..
గణపతి (ముప్పాల లక్ష్మణరావు): CPI (మావోయిస్టు) మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి. ఈ సంస్థ సైద్ధాంతిక గురువు, వ్యూహాత్మక మార్గదర్శి. కేంద్ర నాయకత్వంలో చాలా కాలంగా కీలక వ్యక్తి. మీడియా నివేదికల ప్రకారం.. ఆయన అనారోగ్య కారణాల వల్ల పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. కానీ ఆయన ఇప్పటికీ పార్టీకి సుప్రీం కమాండర్ స్థాయి వ్యక్తిగానే ఉన్నారని సమాచారం.
బప్పారావు: మావోయిస్టు కేంద్ర కమిటీ సీనియర్ సభ్యుడు బప్పారావు. అత్యున్నత నిర్ణయం తీసుకునే సంస్థలలో బప్పారావు పాల్గొంటారని సమాచారం. పార్టీలో గణపతి తర్వాత సంస్థకు కీలక స్తంభంగా ఆయన పరిగణించబడుతున్నారు. ఆయన సంస్థ కార్యాచరణ, నెట్‌వర్క్, వ్యూహాత్మక నిర్ణయాలను నిర్దేశిస్తారని సమాచారం.
దేవుడు : మావోయిస్టు పార్టీ జోనల్ కమిటీ కమాండర్ దేవుడు. ఒక నిర్దిష్ట జోన్‌లో దాడులు/కార్యకలాపాల యొక్క గ్రౌండ్ వ్యూహం, నిర్వహణ ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆయన తన జోన్‌లో చురుగ్గా ఉండటంతో పాటు, పార్టీ ప్రాంతీయ కార్యకలాపాలు, లాజిస్టిక్స్ ఉద్యమాలను నియంత్రిస్తున్నారు.
దేవా: మావోయిస్టు పార్టీ సీనియర్ కమాండర్ దేవా. దాడుల ప్రణాళిక, అమలు, సైనిక విభాగంలో కీలక వ్యక్తి దేవా. ప్రస్తుతం ఆయన పార్టీ యాక్టివ్, సంస్థ యొక్క సైనిక నిర్మాణం, అమలు విభాగాలను నిర్దేశిస్తున్నారు.
రామ్ ధేర్ మాడ్: మావోయిస్టు పార్టీలో మరొక కీలకమైన వ్యక్తి రామ్ ధేర్ మాడ్. ఆయన ప్రస్తుతం పార్టీలో ప్రాంతీయ/ఉప-ప్రాంతీయ కమాండర్లు, స్థానిక లాజిస్టిక్స్, నియామకాలు, చిన్న సాయుధ సమూహాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ‘జంగిల్ నెట్‌వర్క్’, రోజువారీ నక్సలైట్ ఉద్యమాలను బలోపేతం చేయడంలో కీలక వ్యక్తిగా చెబుతుంటారు.
READ ALSO: Lava Agni 4: ముందు వాడండి – తర్వాత కొనండి.. సూపర్ ఆఫర్ ప్రకటించిన స్మార్ట్ ఫోన్ కంపెనీ !