Lava Agni 4: దేశీయ మొబైల్ ఫోన్ బ్రాండ్ లావా కంపెనీ త్వరలో తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 4 ను విడుదల చేయనుంది. ఈ క్రమంలో కంపెనీ ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. లాంచ్‌కు ముందు, కంపెనీ లావా అగ్ని 4 కు ముందస్తు యాక్సెస్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. అంటే మీరు ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు దాన్ని యూజ్ చేయవచ్చు. ఈ సరికొత్త ప్రచారానికి లావా.. బ్రాండ్ డెమో@హోమ్ అని పేరు పెట్టింది. ఈ ప్రచారంలో భాగంగా లావా బృందం మీరు ఫోన్ కొనుగోలు చేసే ముందు అగ్ని 4ని మీ ఇంటికి డెలివరీ చేస్తుంది. ఇది హ్యాండ్‌సెట్‌ను పరీక్షించడానికి, దాని డిజైన్, సామర్థ్యాలను అంచనా వేయడానికి అవకాశం ఇస్తుంది. ఆపై ఫోన్ నచ్చితే, దానిని కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.
READ ALSO: Sheikh Hasina: ఉరిశిక్ష పడిన ‘‘షేక్ హసీనా’’ను భారత్ బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా.?
ఫోన్ కొనడానికి ముందే ఉపయోగించగలరు..
ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 20న లాంచ్ కానుంది. అయితే కంపెనీ ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే డెమో@హోమ్ సేవను అందిస్తోంది. నవంబర్ 20 నుంచి 24 మధ్య బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో కంపెనీ ఈ సరికొత్త ప్రచార కార్యక్రమాన్ని డెమో@హోమ్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ సేవ కోసం వినియోగదారులు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఫోన్‌తో ప్రత్యేకమైన అనుభవాన్ని అందించడానికి పేర్లు నమోదు చేసుకున్న వినియోగదారుల నుంచి కంపెనీ ఎంపిక చేసిన వ్యక్తులను సంప్రదిస్తుంది. ఈ వినియోగదారులు ఫోన్‌ను యూజ్ చేసిన అనంతరం కచ్చితంగా దానిని కొనుగోలు చేయవలసిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది.
ధర, ఫీచర్లు ఏవిధంగా ఉన్నాయంటే..
పలు నివేదికల ప్రకారం.. లావా అగ్ని 4 ధర రూ.30 వేల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుందని చెబుతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ LPDDR5X RAM తో వస్తుంది. ఇది వేగవంతమైనది, అలాగే UFS 4.0 స్టోరేజ్ (తాజా స్టోరేజ్ చిప్) తో వస్తుంది. ఈ ఫోన్ 50MP ప్రైమరీ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుందని సమాచారం. సెకండరీ కెమెరా 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఫోన్ ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరాను అందిస్తుందని సమాచారం. కనెక్టివిటీ ఎంపికలలో USB 3.2, Wi-Fi 6E ఉన్నాయి. అలాగే 5000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుందని సమాచారం.
READ ALSO: Model Tenancy Act 2025: అద్దె ఇంటికి సరికొత్త లెక్కలు.. కొత్త రూల్స్ ఏంటో చూసేయండి !
Be among the first to experience Agni 4 at home.*
Register for Demo at Home & stand a chance to receive an Exclusive Pass.
Register before 20th November: https://t.co/tnr8BgNzjN
Available only in Delhi, Mumbai & Bangalore between 20 & 24 November
*T&C apply#Agni4 #DemoAtHome pic.twitter.com/80sJEZDpZO
— Lava Mobiles (@LavaMobile) November 17, 2025