Maduro: అగ్రరాజ్యం అమెరికా – వెనిజులా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు అమెరికా భయం నిద్రను దూరం చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి రాబోయే రోజుల్లో వెనిజులాపై అమెరికా కొత్త దశ కార్యకలాపాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోందని యూఎస్ అధికారులు తెలిపారు. దీంతో మదురోకు భయం, ఆందోళన పెరిగిపోయి, సరిగ్గా నిద్ర కూడా పట్టలేని స్థాయికి చేరుకుందని తాజాగా బయటపడింది. యూఎస్ ప్లాన్‌లో మదురోను వెనిజులా పదవి నుంచి తొలగించడానికి CIA […]
UPI Refund Process: ఈ రోజుల్లో UPI చెల్లింపులు లేని జీవితాలను ఊహించుకోవడం సాధ్యం కాదు. అంతలా ప్రజల జీవితాల్లో యూపీఐ భాగం అయ్యింది. UPI రాకతో ఒక్క క్లిక్‌తో డబ్బు నిమిషాల్లో బదిలీ అవుతున్నాయి. అయితే కొన్నికొన్ని సార్లు పొరపాటున యూపీఐ ద్వారా రాంగ్ నెంబర్‌కు చెల్లింపులు జరిగే ప్రమాదం ఉంది. ఇకపై ఈ ప్రమాదాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. తాజాగా దీని గురించి RBI జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో సూచించిన రూల్స్ […]
Jamaat-ul-Ahrar: దాయాది దేశంలో ఉగ్రవాదం పెరుగుతోంది. పాకిస్థాన్‌లో ఉగ్రదాడుల వార్తలు రోజూ వెలుగులోకి వస్తున్నాయి. గతంలో షాబాజ్ ప్రభుత్వాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఇబ్బంది పెట్టగా, ఇప్పుడు మరో ఉగ్రవాద సంస్థ పాక్ గుండెలపై ముల్లుగా మారింది. దాని పేరే జమాత్-ఉల్-అహ్రార్ ఉగ్రవాద సంస్థ. ఇది దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తోందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. సోమవారం పాకిస్థాన్‌లోని పెషావర్ పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారు. […]
Laziness Causes: సోమరితనం… ఒక రకంగా చెప్పాలంటే మజ్జు.. ఈ రోజుల్లో యువతలో చాలా మందికి ఆవరించిన అనవసర లక్షణాల్లో ప్రధానమైనది సోమరితనమే అంటున్నారు. వాస్తవానికి ఈ ఆధునిక జీవన శైలిలో అనారోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్ల లేని కారణంగా, శరీరం రోజంతా అలసిపోతుంది. రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత కూడా, కొన్ని సార్లు ఉదయం సోమరితనం ఆవరిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఉదయం నిద్ర లేవాలని అనిపించదు, బలవంతంగా నిద్ర లేచిన కూడా రోజంతా సోమరితనంగా […]
Rajnath Singh: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వరల్డ్ సింధీ హిందూ ఫౌండేషన్ ఆఫ్ అసోసియేషన్స్ (VSHFA) నిర్వహించిన ‘స్ట్రాంగ్ సొసైటీ – స్ట్రాంగ్ ఇండియా’ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింధ్ భూభాగం భారతదేశంలో భాగం కాకపోవచ్చు, కానీ సాంస్కృతిక దృక్పథం నుంచి చూస్తే, సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగానే ఉంటుందని అన్నారు. భూమి విషయానికొస్తే, సరిహద్దులు మారవచ్చు.. ఎవరికి తెలుసు, సింధ్ రేపు మళ్లీ […]
G20 Summit Dispute: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం దౌత్యపరమైన వివాదంతో ముగిసింది. అమెరికా ఈ శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరించి, తన రాయబార కార్యాలయం నుంచి ఒకే ఒక దౌత్యవేత్తను శిఖరాగ్ర సమావేశానికి పంపింది. ఈక్రమంలో దక్షిణాఫ్రికా G20 అధ్యక్ష పదవిని అమెరికా ప్రతినిధికి అప్పగించడానికి నిరాకరించి, సమావేశానికి అమెరికా పంపించిన ప్రతినిధి తక్కువ స్థాయి వ్యక్తి అని అభివర్ణించింది. ప్రతి శిఖరాగ్ర సమావేశం ముగింపులో అధ్యక్ష పదవిని తదుపరి దేశానికి అప్పగిస్తారు. 2026లో […]
Delhi Drug Seizes: దేశ రాజధాని ఢిల్లీలో రూ.200 కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలను ఒక ప్రధాన ఆపరేషన్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్ ఒక ఫామ్‌హౌస్‌పై దాడితో ప్రారంభమైందని, అక్కడ లభించిన కీలకమైన ఆధారాల ఆధారంగా, NCB మూడు రోజుల ఆపరేషన్ నిర్వహించిందని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఒక ప్రధాన అంతర్జాతీయ సింథటిక్ డ్రగ్ నెట్‌వర్క్‌ను గుర్తించిందని వెల్లడించారు. దర్యాప్తులో ఈ ముఠా మొత్తం విదేశీయుల ఆధ్వర్యంలో పని […]
Magicpin – Rapido: దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ మ్యాజిక్‌పిన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో జొమాటో, స్విగ్గీల ఆధిపత్యాన్ని అధిగమించేందుకు రాపిడోతో చేతులు కలిపినట్లు మ్యాజిక్‌పిన్ వెల్లడించింది. ఫుడ్ డెలివరీ మార్కెట్లో మూడో అతిపెద్ద యాప్ అయిన మ్యాజిక్‌పిన్ తన రెస్టారంట్ నెట్‌వర్క్‌ను రాపిడో యాజమాన్యంలోని ‘ఓన్లీ (Ownly)’ ప్లాట్‌ఫాంతో అనుసంధానం చేయననుంది. ఆగస్టులో బెంగళూరులో ప్రారంభమైన ఓన్లీని ఇతర నగరాలకు విస్తరించే ప్రయత్నాలలో భాగంగానే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. READ […]
KL Rahul: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ తర్వాత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా జట్టను ఈ రోజు ప్రకటించారు. గౌహతిలో జరిగిన రెండో టెస్ట్ రెండో రోజున సెలక్షన్ కమిటీ సమావేశమై వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించింది. ఈ టీంకు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు. శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ లేకపోవడంతో జట్టు నాయకత్వ బాధ్యతను సెలక్షన్ కమిటీ రాహుల్‌కు అప్పగించింది. కోల్‌కతా […]
France – Pakistan Controversy: భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌ను తునాతునకలు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్థాన్ చరిత్రలో ఒక్కసారి కూడా కలని కల. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ పాకిస్థాన్‌ను కొలుకోలేని షాక్‌కు గురి చేసిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీంతో నాటి నుంచి కూడా దాయాది దేశం ఆపరేషన్ సింధూర్ గురించి అబద్ధాలు చెబుతూనే ఉంది. దేశంలో జరిగిన విధ్వంసాన్ని దాచుకోలేక, పాకిస్థాన్ ప్రతిచోటా కూడా భారత […]