KL Rahul: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ తర్వాత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా జట్టను ఈ రోజు ప్రకటించారు. గౌహతిలో జరిగిన రెండో టెస్ట్ రెండో రోజున సెలక్షన్ కమిటీ సమావేశమై వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించింది. ఈ టీంకు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు. శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ లేకపోవడంతో జట్టు నాయకత్వ బాధ్యతను సెలక్షన్ కమిటీ రాహుల్‌కు అప్పగించింది. కోల్‌కతా టెస్ట్‌లో జట్టు కెప్టెన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. అలాగే ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే వైస్ కెప్టెన్ అయ్యర్ గాయపడి నాటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు.
భారతదేశం – దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నవంబర్ 30 ఆదివారం రాంచీలో ప్రారంభమవుతుంది. ఈసారి జట్టుకు రాహుల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ వికెట్ కీపర్ – బ్యాట్స్‌మన్ రెండేళ్ల విరామం తర్వాత ఈ ఫార్మాట్‌లో జట్టుకు మళ్లీ నాయకత్వం వహించనున్నాడు. యాదృచ్ఛికంగా ఈ స్టార్ ప్లేయర్ చివరిసారిగా 2023లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియాకు నాయకత్వం వహించాడు.
ఇక వన్డే సిరీస్ కోసం తలపడనున్న జట్టు గురించి చెప్పాలంటే.. అందరూ ఊహించినట్లుగానే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంపికయ్యారు. అయితే మరో నలుగురు ఆటగాళ్లు ఈ ఫార్మాట్‌లోకి తిరిగి వస్తున్నారు. వారిలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి రిషబ్ పంత్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పంత్ ఈ ఫార్మాట్‌లో జట్టులోకి తిరిగి వస్తున్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడంతో, ఛాంపియన్స్ ట్రోఫీలో పంత్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఈ సిరీస్‌లో అయినా ఈ స్టార్ ప్లేయర్‌కు అవకాశం లభిస్తుందో లేదో చూడాలి.
వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..
కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్.
🚨 NEWS 🚨#TeamIndia's squad for @IDFCFIRSTBank ODI series against South Africa announced.
More details ▶️https://t.co/0ETGclxAdL#INDvSA pic.twitter.com/3cXnesNiQ5
— BCCI (@BCCI) November 23, 2025
READ ALSO: Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి వాయిదా.. ఎందుకో తెలుసా!