Laziness Causes: సోమరితనం… ఒక రకంగా చెప్పాలంటే మజ్జు.. ఈ రోజుల్లో యువతలో చాలా మందికి ఆవరించిన అనవసర లక్షణాల్లో ప్రధానమైనది సోమరితనమే అంటున్నారు. వాస్తవానికి ఈ ఆధునిక జీవన శైలిలో అనారోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్ల లేని కారణంగా, శరీరం రోజంతా అలసిపోతుంది. రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత కూడా, కొన్ని సార్లు ఉదయం సోమరితనం ఆవరిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఉదయం నిద్ర లేవాలని అనిపించదు, బలవంతంగా నిద్ర లేచిన కూడా రోజంతా సోమరితనంగా అనిపిస్తుంది. ఇంతకీ ఈ సోమరితనానికి కూడా ఒక విటమిన్ కారణం అని మీలో ఎంత మందికి తెలుసు..
READ ALSO: Bomb Threat : బహ్రెయిన్–హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు
వాస్తవానికి సోమరితనం అనేది నిద్ర లేకపోవడం వల్ల మాత్రమే రాదని, విటమిన్ లోపాల వల్ల కూడా వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు, శరీరంలో కొన్ని విటమిన్లు లోపించినప్పుడు, నిద్ర తక్కువ అయినప్పుడు, ఇక ఆ రోజంతా సోమరితనం, అలసటకు దారితీస్తుందని వెల్లడించారు. ఉదయం సోమరితనాన్ని అధిగమించడానికి ఏమి చేయాలో వైద్యులు సూచించారు. ఇంతకీ అవి ఏంటో తెలుసా..
పలువురు వైద్య నిపుణుల ప్రకారం.. విటమిన్ డి స్థాయిలు తగ్గినప్పుడు, నిద్రలేమి సంభవించవచ్చని చెబుతున్నారు. విటమిన్ డి లోపం వల్ల రోజంతా అలసట, బలహీనత రావచ్చని అన్నారు. విటమిన్ డి లోపం వల్ల కాల్షియం, భాస్వరం స్థాయిలు కూడా తగ్గుతాయని సూచించారు. విటమిన్ డి లోపం వల్ల ఎముకల నొప్పి, రోగనిరోధక శక్తి బలహీనపడటం, రోజంతా నీరసంగా అనిపించడం జరుగుతుందని వెల్లడించారు. ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే ఈ సమస్యలను పరిష్కరించడం చాలా ముఖ్యం అని సూచించారు. విటమిన్ డి సమస్యను పరిష్కరించడానికి ఉత్తమ పరిష్కారం సూర్యకాంతి. దీనికి అదనంగా విటమిన్ డి ఉన్న ఆహారాలు, సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.
విటమిన్ బి12 లోపం అనేది కూడా నీరసానికి కారణమవుతుంది. బి12 స్థాయి తక్కువగా ఉండటం వల్ల అధిక నిద్ర వస్తుంది. బి12 స్థాయి తక్కువగా ఉండటం వల్ల నాడీ, మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు తెలిపారు. విటమిన్ బి12 లేకపోవడం వల్ల నీరసంగా అనిపించవచ్చని, అందువల్ల విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. విటమిన్ బి12 ఆరోగ్యకరమైన నాడీ కణాలు, రక్త కణాలను నిర్వహించడానికి సహాయపడే ముఖ్యమైన పోషకంగా అభివర్ణించారు. అలాగే ఇది DNA తయారీకి కూడా సహాయపడుతుందని వెల్లడించారు.
READ ALSO: Rajnath Singh: ‘సింధ్ రేపు మళ్లీ భారతదేశంలో భాగం కావచ్చు..’