ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల కాని కారణంగా పేదలకు వైద్యం అందడం లేదన్నారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం 6 వేల కోట్లు ఖర్చు చేయదా? అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేట్ విధానంపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోరారు. యూరియా కోసం అడిగితే సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారని, ప్రభుత్వం అవినీతి కారణంగానే యూరియా కొరత […]
15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ విమర్శించారు. కొత్తగా నేను ఏదో చేస్తానని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదం అన్నారు. చంద్రబాబు ‘వాట్సప్ పరిపాలన అంటూ.. వాటాల పరిపాలన’ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని చూడడం దుర్మార్గం అని పేర్కొన్నారు. దళితుల జోలికి పోవడం చంద్రబాబుకు మంచి పద్ధతి కాదని చింతా మోహన్ […]
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులు రిలీజ్ అయ్యారు. కీలక నిందితులు ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పలు ఈరోజు ఉదయం విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు వద్ద 3 గంటల హైడ్రామా తర్వాత నిందితులు విడుదల అయ్యారు. అనంతరం ముగ్గురు నిందితులు తమ నివాసాలకు వెళ్లిపోయారు. విజయవాడ జైలు అధికారులు కావాలనే తమని ఆలస్యంగా విడుదల చేశారని నిందితులు తెలిపారు. లిక్కర్ స్కాం కేసులో […]
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల బెయిల్ కాన్సిల్ చేయాలని ఏపీ హైకోర్టులో ప్రభుత్వం హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు హైకోర్టు అనుమతి కోసం ప్రాసిక్యూషన్ ఎదురు చూస్తున్నారు. మరోవైపు లిక్కర్ స్కాం నిందితులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్దమవుతున్నారు. ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చినా.. 3 గంటల పాటు జైలు అధికారులు అమలు చేయలేదని పిటిషన్ వేయటానికి రెడీగా […]
విజయవాడ సబ్ జైలు వద్ద హైడ్రామా నెలకొంది. లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ ఇచ్చినా.. కావాలని విడుదల చేయటం లేదని న్యాయవాదుల ఆందోళనకు దిగారు. సబ్ జైలు ఎదురుగా బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ఉద్ధేశపూర్వకంగానే విడుదల ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని విజయవాడ జైలు సూపరిటెండెంట్‌పై న్యాయవాదులు ఫైర్ అవుతున్నారు. మరోవైపు సబ్ జైలులో నిందితులు కూడా ఆందోళన చేస్తున్నారు. బెయిల్ ఇచ్చినా విడుదల చేయకపోవటంతో జైలు లోపల […]
Tirumala Temple Closed for 12 Hours Today: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. 16 గంటల పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రేపు ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయంను మూసేస్తారు. ఇవాళ మధ్యహ్నం 2 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు దర్శనాలు […]
యుఎస్ ఓపెన్ 2025 టైటిల్ విజేతగా బెలారస్ భామ అరీనా సబలెంక నిలిచారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అమెరికా క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్ అమండా అనిసిమోవాను 6-3, 7-6(3) తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నారు. ఒక గంటా 34 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. రెండు సెట్లలోనూ సబలెంక సత్తాచాటారు. 17 ఏళ్ల సబలెంక ఆట ముందు 24 ఏళ్ల అమండా తేలిపోయారు. ఫైనల్లో సబలెంక పూర్తి ఆధిపత్యం చెలాయించి విజేతగా నిలిచారు. […]
నేడు విజయవాడ సబ్ జైలు నుంచి విడుదల కానున్న లిక్కర్ స్కాం కేసు నిందితులు.. కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు నిన్నే బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు నేడు రాజమండ్రి పుష్కర్ ఘాట్‌లో వినూత్నంగా సాగనున్న ‘శుభంకర మహా గణపతి’ నిమజ్జనం.. శుభాలు కల్గించే నూలుపోగులతో కొలువుదీరిన వినాయకుడు.. 99 వేలు నూలు పోగులతో కొలువైన వినాయకుడి విగ్రహం.. ఈ విగ్రహం నూలుపోగులను ప్రసాదంగా భక్తులకు పంపిణీ చంద్రగ్రహణం […]
కర్కాటక రాశి వారు నేడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబ పరమైన సంతోషాలు ఉంటాయి. ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు కర్కాటక రాశికి అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. ఈరోజు అమ్మవారి అష్టాదశ శక్తిపీఠ స్తోస్త్రంను పారాయణం చేయడం మంచింది. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి నేటి దిన ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు […]
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోకుండా.. సీబీఐ విచారణకు ఎందుకు ఇచ్చినట్టు అని ప్రభుత్వంను ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సీబీఐ మీద నమ్మకం లేదన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్టు అని విమర్శించారు. బీజేపీపై బట్ట కాల్చి మీద వేసేందుకు సీబీఐకి కేసు అప్పగించారని.. సీబీఐకి ఈ ప్రభుత్వం సహకరిస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే చెప్పేందుకు.. ఇదంతా ఒక పన్నాగం అని మండిపడ్డారు. బీఆర్ఎస్ను […]