క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆసియా కప్ 2025 నేటి నుంచే ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నమెంట్.. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరిగే మ్యాచ్‌తో మొదలవనుంది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఆసియా జట్లు సిద్ధం కావడానికి ఆసియా కప్‌ను పొట్టి ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. మొత్తం ఎనిమిది జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. […]
Rohit Sharma spotted at Hospital in Mumbai: ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆతిథ్య యూఏఈతో బుధవారం తలపడేందుకు భారత జట్టు సిద్ధమవుతుండగా.. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆసుపత్రికి వెళ్లాడు. సోమవారం అర్ధరాత్రి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి హిట్‌మ్యాన్ వెళ్లాడు. రోహిత్ ఆసుపత్రిలోకి ప్రవేశించే సమయంలో రిపోటర్స్ ఫోటోగ్రాఫర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […]
ఆసియా కప్ 2025 ఈరోజు యూఏఈలో ఆరంభం కానుంది. అబుదాబిలో రాత్రి 8 గంటలకు హాంకాంగ్, అఫ్గానిస్థాన్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్, యూఏఈ ప్లేయర్స్ సాధన చేస్తున్నారు. మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా స్టార్ శుభ్‌మన్ గిల్‌తో తనకున్న అనుబంధాన్ని యూఏఈ బౌలర్ సిమ్రన్‌జిత్ సింగ్ గుర్తుచేసుకున్నాడు. గిల్ చిన్నప్పటి నుంచే తనకు తెలుసు అని.. కానీ ఇప్పుడు అతడికి నేను గుర్తున్నానో లేదో […]
Balapur Hundi Income 2025: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశుడి లడ్డూకు ఎంతో క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది లడ్డూకు రికార్డు ధర పలుకుతోంది. గతేడాది కొలను శంకర్ రెడ్డి రూ.30.01 లక్షలకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అందరి అంచనాలను అందుకుంటూ బాలాపూర్ వినాయకుడి చేతి లడ్డూ రికార్డు ధర పలికింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ రూ.35 లక్షలకు సొంతం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డే కాదు.. హుండీ […]
సెప్టెంబర్ 9 నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్ 2025 ఆరంభం కానుంది. టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ హాంకాంగ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరగనుండగా.. భారత్ తన మొదటి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. ఆసియా కప్ కోసం టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. ఆసియా కప్‌లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించేందుకు సిద్దమయ్యాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటి వరకు […]
హైదరాబాద్‌లో భారీ మొత్తంలో నోట్లు పట్టుబడ్డాయి. నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద మరో ఇద్దరిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురి వద్ద ఉన్న 3 బ్యాగుల్లోని రూ.2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ నోట్లు అన్ని రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు. Also Read: Crime News: అంబర్ పేట్లో దారుణం.. భార్యపై కన్నేశాడని స్నేహితుడిని..! […]
అంబర్ పేట్లో మూసీ కాలువలో కొట్టుకొచ్చిన అనుమానస్పద మృతదేహంపై మిస్టరీ వీడింది. యువకుడిని (షోరబ్) హత్య చేసి మూసీ కాలువలో పడేశారని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు (మహమ్మద్ జావిద్, మహమ్మద్ అమీరుల్ హాక్) యువకుడి మెడకి వైర్లు చుట్టి హత్య చేసినట్లుగా గుర్తించారు. అంబర్ పేట పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. డీసీపీ బాలస్వామి యువకుడి హత్య వివరాలను మీడియాకు వెల్లడించారు. మహమ్మద్ జావేద్ (27), మహమ్మద్ అమీరుల్ హాక్, షోరబ్ (30) ముగ్గురు […]
Hardik Pandya Luxury Watch: ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2025కి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో టోర్నీ జరగనుండగా.. మొదటి మ్యాచ్ హాంకాంగ్, అఫ్గానిస్థాన్ టీమ్స్ మధ్య జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈని ఢీకొట్టనుంది. ఆసియా కప్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న టీమిండియా ప్లేయర్స్.. ముమ్మరంగా సాధన చేస్తున్నారు. భారత ఆటగాళ్లు గత 4-5 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఆసియా కప్ ఆరంభానికి […]
Telangana BJP State Committee Announcement: తెలంగాణ రాష్ట్ర కమిటీని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. ముగ్గురు జనరల్ సెక్రటరీలు (ప్రధాన కార్యదర్శులు), 8 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులతో కమిటీ ఏర్పాటైంది. జనరల్ సెక్రటరీలుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్‌ను నియమించినట్లు తెలంగాణ బిజెపి చీఫ్ రామచందర్ రావు తెలిపారు. ఉపాధ్యక్షులుగా బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బండారి శాంతికుమార్, బండ కార్తీకారెడ్డి.. ఎన్నికయ్యారు. సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్, చీఫ్ స్పోక్స్ పర్సన్, […]
నల్గొండ ప్రజల కోసమే మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు చెప్పారని.. ఎవరెన్ని సమస్యలు సృష్టించినా సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్య మాత్రమే కాకుండా.. నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కూడా తీరుతుందన్నారు. సబర్మతి, యమునా, గంగా నది ప్రక్షాళన జరగొచ్చు కానీ.. మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? అని సీఎం ప్రశ్నించారు. మూసీ […]