BCCI Invites Bids for Team India Sponsorship: ఆన్లైన్ గేమింగ్ చట్టం 2025 పార్లమెంట్లో ఆమోదం పొందిన నేపథ్యంలో టీమిండియా టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి ‘డ్రీమ్ 11’ వైదొలిగిన విషయం తెలిసిందే. దాంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్‌ను వెతుక్కునే వేటలో పడింది. ఇందులో భాగంగానే మంగళవారం దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. టీమిండియా స్పాన్సర్ షిప్ కోసం బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆసక్తి గల కంపెనీలు పలు నియమ, నిబంధనలకు లోబడి ఉండాలని […]
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 14 మంది మరణించగా.. దాదాపుగా 30 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు చికిత్స నిమ్మితం సమీప ఆస్పత్రికి తరలించారు. బలోచిస్థాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రావిన్షియల్ ముఖ్యమంత్రి సర్దార్ అతావుల్లా మెంగల్ వర్ధంతిని పురస్కరించుకుని బలోచ్ రాజధాని క్వెట్టాలో బీఎన్పీ రాజకీయ సమావేశం నిర్వహించగా.. ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారి హంజా షఫాత్ […]
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మామ కేసీఆర్ వాటా ఎంత?, అల్లుడు హరీశ్ రావు వాటా ఎంత?, ఇతరుల వాటా ఎంత? అనేది సీబీఐ విచారణలో తేలుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాళేశ్వరంలో కర్త, కర్మ, క్రియ అని తానే అని చెప్పుకున్న కేసీఆర్.. అవినీతికి కూడా బాధ్యత వహించాల్సిందే అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత మాటలతో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్పష్టంగా తేలిపోయిందన్నారు. కేసీఆర్ కుటుంబం దొంగల ముఠా అని.. వాటాల పంపకాల […]
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత కూతురు పైనే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను బహిష్కరించారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధిష్టానం మరి కాసేపట్లో అధికారికంగా నోట్ విడుదల చేయనుంది. కవిత గత కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడమే ఈ వేటుకు కారణమైంది. సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన కవితపై ప్రస్తుతం గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్, […]
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావును కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు 2021లో పీసీసీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి రాజ్ […]
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరకాల కోరిక అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. వైఎస్ఆర్ తన కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతారని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి మహేష్ కుమార్ గౌడ్ […]
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేపట్టవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామన్న హైకోర్టు.. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ […]
లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. వినాయక నిమజ్జనానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వాసులు నాదర్గుల్కు చెందిన తర్రె చైతన్య యాదవ్ (23), ఉప్పల్‌కు చెందిన రిషి తేజ (21) అక్కడిక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గురైన వారందరూ తెలుగు […]
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం నడుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా.. కేసును ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించింది. కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. డీఎస్పీ యాక్ట్ సెక్షన్ 6 కింద రాష్ట్రం నుంచి కేంద్రానికి నోటిఫికేషన్ వెళ్లింది. రాష్ట్రంలో సీబీఐకి జనరల్ కన్సెంట్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం కూడా సెక్షన్ […]
చనిపోయాడని అనుకుని అంతిమ సంస్కారాలు చేసేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేయగా.. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తన అభిమానిని కడచూపు చూసేందుకు ఇంటికి వెళ్లారు. పూలమాల వేస్తుండగా బాడీలో కదలికలు వచ్చాయి. ఇది గమనించిన మాజీ మంత్రి.. గట్టిగా పిలవటంతో మరింతగా కదలాడు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అతడు బతికి బయటపడ్డాడు. తన అభిమాన నాయకుడి పిలుపుతో వీరాభిమాని ఏకంగా మృత్యువునే జయించాడు. మాజీ మంత్రి దేవుడిలా వచ్చి కాపాడారంటూ కుటుంబసభ్యులు కొనియాడారు. ఈ ఘటన […]