కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోకుండా.. సీబీఐ విచారణకు ఎందుకు ఇచ్చినట్టు అని ప్రభుత్వంను ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సీబీఐ మీద నమ్మకం లేదన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్టు అని విమర్శించారు. బీజేపీపై బట్ట కాల్చి మీద వేసేందుకు సీబీఐకి కేసు అప్పగించారని.. సీబీఐకి ఈ ప్రభుత్వం సహకరిస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే చెప్పేందుకు.. ఇదంతా ఒక పన్నాగం అని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని, 20 నెలల కింద ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని డీకే అరుణ చెప్పారు.
’20 నెలల కింద ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేది. బీజేపీ పైన బురద జల్లెందుకే ఈ సీబీఐ విచారణ. బీఆర్ఎస్‌ను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ నేతలను కాపాడేందుకే కాంగ్రెస్ చిత్తశుద్ధితో పని చేస్తుంది. కేసీఆర్‌పై చర్యలు తీసుకోకుండా సీబీఐ విచారణకు ఎందుకు ఇచ్చినట్టు. మేము అధికారంలో అవినీతి సొమ్మును కక్కిస్తామని అన్నారు. కానీ వారిని కాపాడడంలోనే బిజీగా ఉన్నారు. సీబీఐ మీద నమ్మకం లేదన్న కాంగ్రెస్.. సీబీఐకి ఎందుకు ఇచ్చినట్టు. బీజేపీపై బట్ట కాల్చి మీద వేసేందుకు సీబీఐకి ఇచ్చారు. సీబీఐకి ఈ ప్రభుత్వం సహకరిస్తుందని నమ్మకం లేదు. సాక్ష్యాలు ఇవ్వరు.. మాయం చేస్తారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే చెప్పేందుకు ఇదంతా ఒక పన్నాగం. బీఆర్ఎస్ హైడ్రామా ఆడుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే. కేసీఆర్ లేకుంటే కవిత ఎవరు’ అని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.
Also Read: Kalvakuntla Kavitha: ‘నాన్నా’ జాగ్రత్త.. మీ వెనక భారీ కుట్ర జరుగుతోంది!
‘కేసీఆర్ వారసత్వం పోరాటం.. ఒకరి పైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేసీఆర్ సపోర్ట్ లేకుండా కాళేశ్వరంలో ఏదైనా జరిగిందా?. అవినీతికి బాధ్యత ఆ కుటుంబంలోని అందరిదే. లిక్కర్ కేసులో కవిత కూడా జైలుకు పోయి వచ్చింది. గద్వాలలో అభివృద్ధి కుంటుపడింది. అక్కడ ప్రజా ప్రతినిధికి ఎలాంటి సంబంధం లేదు. మెడికల్ కాలేజీలో మా ప్రయత్నం కూడా ఉంది. ఈ విషయంపై చర్చకు సిద్ధం. రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో.. ఇదంటే ఆయనకు కోపం వస్తుంది. చేతకాని వాళ్ళు చాలా మాట్లాడుతారు. ఆయన చేతనయ్యి గెలవలేదు.. చావు తప్పి లొట్టపోయి గెలిచారు. మహబూబ్ నగర్ నా సొంత జిల్లా. నేను ఎక్కడో పోయి పోటీ పడలేదు. మా ఇంట్లో నుండే ఆయనకి రాజకీయ జీవితం.. మేము లేకపోతే అయన ఎక్కడ. కొమ్ములొచ్చి చాలా మాట్లాడుతున్నారు’ అని డీకే అరుణ ఫైర్ అయ్యారు.