గుంటూరు జిల్లా తెనాలి మండలంలో మహమ్మారి ‘కలరా’ కలకలం రేపుతోంది. అంగలకుదురు గ్రామంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ మహిళకు కలరా వ్యాధి నిర్ధారణ అయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సదరు మహిళ ప్రస్తుతం తాడేపల్లిలోని మణిపాల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మహిళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, మరో 2-3 రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. మహిళకు కలరా వ్యాధి నిర్ధారణ కావడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాలు ఇలా […]
ఆదాయం వచ్చే పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అరటి, మిరప, మామిడి, పూలు, టమాటో, బత్తాయి, ఆయిల్‌పామ్, మిరియాలు, నిమ్మ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. వచ్చే ఐదేళ్లలో హార్టీకల్చర్‌ను 25 లక్షల హెక్టార్లకు పెంచేలా చర్యలు చేపట్టామని చెప్పారు. మరో పదేళ్లలో మహారాష్ట్ర, యూపీని అధిగమించి.. ఏపీ నెంబర్‌వన్ కావాలని ఆకాక్షించారు. రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారని సీఎం చెప్పుకొచ్చారు. […]
రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్‌గా జీఎస్టీ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాల్లో అనేక మార్పులు వస్తాయన్నారు. ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్’ అని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం అవుతోందన్నారు. బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని సీఎం చెప్పారు. దసరా నుంచి దీపావళి వరకు జీఎస్టీ ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. జీఎస్టీ సంస్కరణలపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు […]
మెగా డీఎస్సీకి ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయవంతంగా పూర్తిచేశాం అని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 106 కేసులు ఎదుర్కొని కార్యక్రమాన్ని జయప్రదం చేశామన్నారు. మెగా డీఎస్సీ నియామకపత్రాలు అందజేతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నను ఆహ్వానించా అని చెప్పారు. నియామక పత్రాలు అందజేత కార్యక్రమానికి తప్పకుండా వస్తానని పవన్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇక ప్రతిఏటా ఓ పద్ధతి ప్రకారం డీఎస్సీ నిర్వహిస్తాం అని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో […]
కడప టీడీపీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసుల రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు బహిరంగంగా నిరసనలకు దిగాయి. సీనియర్ నాయకుడు కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు సమావేశం అయ్యారు. అనంతరం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవికి మంచి బుద్ది ప్రసాదించాలని ఆదేవుడిని కోరారు. Also Read: Abhishek Sharma: దానికోసమే వెయిటింగ్.. అభిషేక్ సోదరి […]
ఆసియా కప్ 2025లో అభిషేక్ శర్మ సెంచరీ చేయాలని తాను కోరుకుంటున్నట్లు సోదరి కోమల్ శర్మ చెప్పారు. సెంచరీ కోసమే తాను వెయిటింగ్ చేస్తున్నానని వెల్లడించారు. అభిషేక్ అద్భుతమైన టాలెంట్ కలిగిన ప్లేయర్ అని, అతడికి ఆకాశమే హద్దు అని తెలిపారు. అభిషేక్ ఆట చూడటం బాగుందని, దాయాది పాకిస్థాన్‌పై ఇన్నింగ్స్‌ను ఆస్వాదించాం అని అభిషేక్ తల్లి మంజు శర్మ చెప్పుకొచ్చారు. 2025 ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ చెలరేగాడు. 39 […]
ఆసియా కప్ 2025లో భాగంగా గ్రూప్ స్టేజ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర ఓటమిని ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత కరచాలనం వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరచాలనం విషయంలో మ్యాచ్ రిఫరీపై ఏసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. అయితే ఐసీసీ మాత్రం పీసీబీ ఫిర్యాదును పక్కనపెట్టింది. సూపర్-4లో ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ.. చిరకాల […]
2025 దీపావళి సందర్భంగా ‘షావోమీ ఇండియా’ తన కస్టమర్లకు పండుగ సేల్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 22 నుంచి షావోమీ దీపావళి సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఎంఐ.కామ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాములతో కలిసి అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తుంది. సేల్ సమయంలో వినియోగదారులు స్మార్ట్ఫోన్లపై 45 శతం వరకు, క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీలపై 55 శతం వరకు టాబ్లెట్లపై 60 శతం వరకు ఆదా చేసుకోవచ్చు. షావోమీ దీపావళి పండుగ సీజన్లో రెడ్మీ […]
ప్రముఖ టెక్ దిగ్గజం ‘యాపిల్’ ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఈసారి కొత్తగా ఐఫోన్ 17 ఎయిర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే 17 సిరీస్ ఫోన్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. 17 సిరీస్ లాంచ్ నేపథ్యంలో 16 సిరీస్ ఫోన్ల ధరలను యాపిల్ కంపెనీ తగ్గించింది. అంతేకాదు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీగా తగ్గింపు ఉంది. అన్ని ఆఫర్స్ […]
ఆసియా కప్ 2025 సూపర్-4లో భాగంగా మరికొన్ని గంటల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ రాత్రి 7:30 గంటలకు పడనుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో పాక్‌ను ఓడించిన భారత్.. మరోసారి జయకేతనం ఎగురవేయాలని చూస్తోంది. గ్రూప్ స్టేజ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. ఒకవేళ అనివార్య కారణాల చేత భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దైతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. దుబాయ్‌లో […]