హైదరాబాద్ నగరంలోని కోకాపేట్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య కూరగాయాల కత్తితో రప్పా రప్పా పొడిచి హత్య చేసింది. దంపతుల మధ్య చిన్న గొడవ జరిగి.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈక్రమంలో విచక్షణ కోల్పోయిన భార్య కత్తితో భర్తపై అతికిరాతంగా దాడి చేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన భార్త.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యను అరెస్ట్ చేశారు.
Also Read: iPhone 17: ఈ క్రేజ్ ఏంట్రా బాబు.. ఐఫోన్ 17 కోసం స్టోర్ల ముందు అర్ధరాత్రి నుంచే పడిగాపులు!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దంపతులు భరత్ బోరా, కృష్ణ జ్యోతి బోరాలు బతకుతెరువు కోసం కోసం అస్సాం నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఇద్దరు కొకాపేట్‌లో కార్మికులుగా పని చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్లుగా భార్య కృష్ణ జ్యోతిని భర్త భరత్ వేధింపులకు గురిచేస్తున్నాడు. క్రమంలో గురువారం అర్ధరాత్రి చిన్న విషయానికి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వివక్ష కోల్పోయిన భార్య.. తన భర్తపై కూరగాయాల కత్తితో దాడి చేసింది. దీంతో భరత్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భరత్ కేకలు విన్న చుట్టుపక్కల వారు.. ఇంటి లోపలికి వచ్చి చూడగా రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భరత్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నార్సింగ్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి భార్య కృష్ణ జ్యోతిని అరెస్ట్ చేశారు.