IND vs NEP Playing 11: ఆసియా కప్ 2023లో భారత్ మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. పసికూన నేపాల్‌తో రోహిత్ సేన తలపడనుంది. విజయంతో టోర్నీలో శుభారంభం చేయడమే కాకుండా.. గ్రూప్-ఏలో సూపర్-4 బెర్తు దక్కించుకోవాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. ఒకవేళ వర్షం కారణంగా భారత్, నేపాల్ మ్యాచ్ రద్దయినా.. 2 పాయింట్లతో టీమిండియా ముందంజ వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ చేతిలో నేపాల్ ఓటమి పాలైంది. […]
Man was caught drunk and driving and set his bike on fire: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడితే.. కొందరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు లేదా వాగ్వాదానికి దిగుతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్ పోలీసుల ఎదుటే నిప్పు అంటించాడు. మంటలను ఆర్పిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ […]
Bigg Boss Telugu 7 Contestants List: ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ ఇప్పటివరకు తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఆదివారం (సెప్టెంబర్ 3) ఏడో సీజన్ అట్టహాసంగా ఆరంభమైంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా వచ్చారు. ‘ఈ సీజన్లో అన్నీ ఉల్టా పల్టా’ అంటూ ఇన్ని రోజులు ఆసక్తి రేకెత్తించిన నాగ్.. తొలుత హౌస్‌లోకి వచ్చి విశేషాలు పంచుకున్నారు. ఆపై కంటెస్టెంట్లను పరిచయం చేశారు. ఇక నాగార్జున తన సరికొత్త గెటప్, తనదైన […]
KL Rahul Fitness Test on September 4 at NCA: స్వదేశంలో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఆడే భారత జట్టుకు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపిక అవుతాడా? లేదా? అన్న అనుమానాలకు దాదాపుగా తెరపడినట్లే కనబడుతోంది. ప్రపంచకప్ జట్టులో రాహుల్‌కు చోటు ఖాయం అని తెలుస్తోంది. ఫిట్నెస్ విషయంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) పచ్చ జెండా ఊపడమే ఇందుకు కారణం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం […]
Gold Today Rate in Hyderabad on 4th September 2023: కొన్ని రోజులుగా పెరుగుదలే తప్ప.. తగ్గడం లేదన్నట్లు బంగారం ధరలు దూసుకుపోయాయి. ధరల పెరుగుదలతో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ఎప్పుడో రూ. 60 వేలు దాటేసింది. ఆదివారం పెరిగిన పసిడి ధరలు సోమవారం మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీ నుంచి హైదరారాబాద్ వరకు బంగారం ధరకు నిన్నటితో పోల్చితే.. పెద్దగా మార్పు కనిపించడం లేదు. బులియన్ మార్కెట్లో సోమవారం (సెప్టెంబర్ 4) 22 […]
Jasprit Bumrah and Sanjana Ganesan is expecting the birth of first child: ఆసియా కప్ 2023కోసం శ్రీలంకలో ఉన్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో అత్యవసరంగా స్వదేశానికి తిరిగి వచ్చాడు. దాంతో నేపాల్‌తో సోమవారం జరిగే మ్యాచ్‌కు బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా భారత్‌కు వచ్చిన విషయంపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే బుమ్రా స్వదేశానికి తిరిగి రావడంపై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. […]
Asia Cup 2023 Super 4 games likely to be shifted: ఆసియా కప్ 2023కి పాకిస్థాన్, శ్రీలంకలు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. పాక్‌లో 4, లంకలో 9 మ్యాచ్‌లు నిర్వహించేలా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం గ్రూప్ దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. పాక్‌లో మ్యాచ్‌లు సజావుగానే జరుగుతున్నా.. శ్రీలంకలోని మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. పల్లెకెలెలో శనివారం జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రద్దయింది. రానున్న రోజుల్లో […]
Jasprit Bumrah returns India Ahead of Nepal Clash in Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భాగంగా సోమవారం భారత్, నేపాల్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేపాల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న బుమ్రా.. వ్యక్తిగత కారణాలతో స్వదేశం వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. సూపర్ 4 మ్యాచ్‌లు ఆరంభం అయ్యే సమయానికి మళ్లీ జట్టులోకి […]
Pakistan Fan Creates Live Sized Sand Art For Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. భారత్‌లోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా మనోడికి భారీగా అభిమానులు ఉన్నారు. దాయాది కోహ్లీ పాకిస్తాన్లో కూడా ‘కింగ్’ కోహ్లీకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. బలూచిస్థాన్‌కు చెందిన కొంతమంది ఫ్యాన్స్.. కోహ్లీపై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ […]