Jasprit Bumrah returns India Ahead of Nepal Clash in Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భాగంగా సోమవారం భారత్, నేపాల్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేపాల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న బుమ్రా.. వ్యక్తిగత కారణాలతో స్వదేశం వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. సూపర్ 4 మ్యాచ్‌లు ఆరంభం అయ్యే సమయానికి మళ్లీ జట్టులోకి వస్తాడని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అత్యవసర పని మీద బుమ్రా ముంబైకి వచ్చినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.
జస్ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేశన్ ఆసియా కప్ 2023లో భాగంగా శ్రీలంకలోనే ఉన్నారు. ఇటీవల ఇద్దరు కలిసి ఓ ఆన్‌లైన్ గేమ్ కూడా ఆడారు. అయితే అత్యవసరంగా బుమ్రా స్వదేశానికి తిరిగి రావడంతో.. అతడి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారేమోనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక బుమ్రా గైర్హాజరీలో మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి రానున్నాడు. మహ్మద్ సిరాజ్‌తో అతడు బౌలింగ్ బాధ్యతలు మోయనున్నాడు.
Also Read: Virat Kohli: పాకిస్తాన్‌లో విరాట్‌కి క్రేజ్ మాములుగా లేదు.. ఇసుకలో ‘కింగ్’ కోహ్లీ!
వెన్ను గాయంతో దాదాపుగా ఏడాది పాటు జట్టుకు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా.. ఇటీవలే ఐర్లాండ్ పర్యటనతో రీఎంట్రీ ఇచ్చాడు. అద్భుత బౌలింగ్‌తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా బౌలింగ్ చేయకపోయినా.. బ్యాటింగ్‌లో కీలక పరుగులు జోడించాడు. ప్రపంచకప్ 2023 నేపథ్యంలో బుమ్రా సన్నద్ధత కావడానికి ఆసియా కప్ ఉపయోగపడనుంది.
Jasprit Bumrah has returned to Mumbai due to personal reasons.
He'll be available for the Super 4 stage of Asia Cup 2023. (Dainik Jagran). pic.twitter.com/ClUb2aO1oE
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 3, 2023