Gold Today Rate in Hyderabad on 4th September 2023: కొన్ని రోజులుగా పెరుగుదలే తప్ప.. తగ్గడం లేదన్నట్లు బంగారం ధరలు దూసుకుపోయాయి. ధరల పెరుగుదలతో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ఎప్పుడో రూ. 60 వేలు దాటేసింది. ఆదివారం పెరిగిన పసిడి ధరలు సోమవారం మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీ నుంచి హైదరారాబాద్ వరకు బంగారం ధరకు నిన్నటితో పోల్చితే.. పెద్దగా మార్పు కనిపించడం లేదు.
బులియన్ మార్కెట్‌లో సోమవారం (సెప్టెంబర్ 4) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,220గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,370గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,450లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,490 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,220గా కొనసాగుతోంది.
Also Read: Jasprit Bumrah: స్వదేశానికి జస్ప్రీత్ బుమ్రా.. అసలు కారణం ఇదే!
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర సోమవారం రూ. 77,900లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఏ మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,900గా ఉండగా.. చెన్నైలో రూ. 80,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,300 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 80,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,000ల వద్ద కొనసాగుతోంది.