Warangal: పోలీసుల ముందే బైక్‌కు నిప్పు పెట్టిన వ్యక్తి.. కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man was caught drunk and driving and set his bike on fire: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడితే.. కొందరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు లేదా వాగ్వాదానికి దిగుతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్ పోలీసుల ఎదుటే నిప్పు అంటించాడు. మంటలను ఆర్పిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్‌లో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ ట్రాఫిక్ ఎస్సై రవి ఆధ్వర్యంలో శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. శివనగర్ ప్రాంతానికి చెందిన పులిశేరు శివ పూటుగా మద్యం తాగి తన ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారని గ్రహించిన శివ.. ప్రధాన తపాలా కేంద్రం కూడలి రహదారి పక్కన ద్విచక్ర వాహనం నిలిపి రోడ్డు దాటుతుండగా పోలీసులు పట్టుకున్నారు. మద్యం తాగి వాహనం నడుపుతూ వచ్చావని, కేసు నమోదు చేస్తామని పోలీసులు అందడంతో శివ ఆవేశానికి గురయ్యాడు.
Also Read
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
- Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
Also Read: Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ జాబితా ఇదే.. ఈసారి ఎవరెవరున్నారంటే?
శివ తన ద్విచక్ర వాహనం పెట్రోల్ పైపును తొలగించి.. నిప్పు పెట్టాడు. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రాఫిక్ పోలీసులు పక్కనే ఉన్న దుకాణంలో నుంచి నీళ్లు తెచ్చి మంటలు ఆర్పేశారు. ఆపై శివ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి.. వరంగల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ కేంద్రానికి తరలించారు. అయితే తాను వాహనం నడుపుతూ దొరక లేదని, కేసు ఎలా నమోదు చేస్తారని శివ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబందింసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజావార్తలు
-
Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
-
Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!