Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ జాబితా ఇదే.. ఈసారి ఎవరెవరున్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss Telugu 7 Contestants List: ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ ఇప్పటివరకు తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఆదివారం (సెప్టెంబర్ 3) ఏడో సీజన్ అట్టహాసంగా ఆరంభమైంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా వచ్చారు. ‘ఈ సీజన్‌లో అన్నీ ఉల్టా పల్టా’ అంటూ ఇన్ని రోజులు ఆసక్తి రేకెత్తించిన నాగ్.. తొలుత హౌస్‌లోకి వచ్చి విశేషాలు పంచుకున్నారు. ఆపై కంటెస్టెంట్‌లను పరిచయం చేశారు. ఇక నాగార్జున తన సరికొత్త గెటప్, తనదైన చమత్కారాలతో ఏడో సీజన్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌ని చాలా ఎంటర్‌టైనింగ్‌గా నడిపించారు.
సీజన్-7లో భాగంగా తొలి కంటెస్టెంట్ ‘జానకి కలగనలేదు’ సీరియల్ నటి ప్రియాంక జైన్ హౌసులోకి అడుగుపెట్టారు. రెండో కంటెస్టెంట్‌గా మాజీ హీరో శివాజీ ప్రవేశించారు. మూడో కంటెస్టెంట్‌గా సింగర్ దామిని రాగా.. నాలుగో కంటెస్టెంట్‌గా ప్రిన్స్ యావర్ వచ్చాడు. ఆపై శుభశ్రీ, షకీలా, ఆట సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, రతిక రోజ్, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ బిగ్‌బాస్ హౌసులోకి అడుగుపెట్టారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
మరోవైపు తమ కొత్త చిత్రాలను ప్రమోట్ చేసుకునే క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి సందడి చేశారు. దేవరకొండ, నవీన్ కలిసి కింగ్ నాగార్జునతో సరదాగా మాట్లాడారు. ఆపై ఈ ఇద్దరు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి కంటెస్టెంట్‌లను ఉత్సాహపరిచారు. దేవరకొండ ఖుషి సినిమా ప్రమోట్ చేసుకునేందుకు హౌసులోకి రాగా.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా కోసం నవీన్ వచ్చాడు.
Also Read: KL Rahul: ఎన్‌సీఏ గ్రీన్ సిగ్నల్.. ప్రపంచకప్ 2023 జట్టులో కేఎల్ రాహుల్!
బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ జాబితా:
ప్రియాంక జైన్
శివాజీ
దామిని భట్ల
ప్రిన్స్ యవార్
శుభశ్రీ
షకీలా
ఆట సందీప్
శోభా శెట్టి
టేస్టీ తేజ
రతిక రోజ్
డాక్టర్ గౌతమ్ కృష్ణ
కిరణ్ రాథోడ్
పల్లవి ప్రశాంత్
అమర్‌దీప్
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!