Sabarimala Darshan Hours Extended: ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమల అయ్యప్ప దర్శన సమయాన్ని టీబీడీ గంటసేపు పొడిగించింది. ప్రస్తుతం రోజులో రెండో భాగంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు. ఇక నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచే దర్శనాలు మొదలై.. రాత్రి 11 గంటల వరకు కొనసాగనున్నాయి. Also Read: YSR Law […]
Telangana Women’s Free Bus Travel Scheme: ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఇది ఒకటి. తాము అధికారంలోకి వస్తే.. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. చెప్పిన విధంగానే మహిళల ఉచిత ప్రయాణంకు ఏర్పాట్లు చేస్తోంది. ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే.. ప్రభుత్వానికి ఎంత భారం పడనుందనే విషయంలో ఆర్టీసీ అధికారులు ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు. కర్ణాటక […]
Minister Karumuri Venkata Nageswara Rao Visits Cyclone affected areas: ‘మిచౌంగ్’ తుపాన్ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. అన్ని విధాలుగా ఆదుకుంటాం అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. సీఎం ప్రతి అంశంపై మానిటరింగ్ చేస్తున్నారని, నష్టపోయిన రైతులు అన్ని విధాల ఆదుకోవాలని అధికారులకు సూచనలు చేశారని తెలిపారు. నేడు విజయవాడ – మచిలీపట్నం హైవే రోడ్డు పరిసర ప్రాంతాలను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిలించారు. ఈ […]
AP CM YS Jagan React on Cyclone Michaung Effect: ఏపీలోని తుపాను ప్రభావిత పరిస్థితులపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులంతా తమ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. బాధితుల స్థానంలో తాము ఉంటే ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో ఆ తరహా సహాయం అందించాలని, రూ. 10లు ఎక్కువైనా […]
AP Deputy CM Narayana Swamy challenge Nara Lokesh Over Land: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సెటైర్లు వేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవని లోకేష్.. రెడ్ బుక్ రాస్తున్నాడంట అని ఎద్దేవా చేశారు. తాను 200 ఎకరాలు భూమిని కబ్జా చేశానని లోకేష్ అంటున్నాడని, ఎక్కడ ఉందో చెప్పి నిరూపించాలని సవాల్ విసిరారు. తనపై లేనిపోని విమర్శలు చేస్తే వంశమే ఉండదని […]
181.5 mm rainfall in AP: ఏపీలో ‘మిచాంగ్’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో ఏపీ తడిసి ముద్దయింది. తుఫాన్ దాటికి వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలమయం అవ్వగా.. రోడ్డుపైకి భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో చేతికి […]
Revanth Reddy Swearing Ceremony Time Changed: తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. గురువారం (డిసెంబర్ 7) మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. గురువారం ఉదయం 10.28 గంటలకు రేవంత్ ప్రమాణ స్వీకారం చేయాలని ముందుగా నిర్ణయించగా.. తాజాగా ఆ సమయంలో స్వల్ప మార్పు జరిగింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. […]
Deepak Chahar Set To Miss India Tour Of South Africa: భారత పేసర్ దీపక్ చహర్ దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యే అవకాశం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన తండ్రి లోకేంద్ర సింగ్ కోలుకునే వరకు ఆయన వెంటే ఉంటానని దీపక్ తాజాగా వెల్లడించాడు. ఇదే విషయాన్ని కోచ్ రాహుల్ ద్రవిడ్ మరియు బీసీసీఐ సెలెక్టర్లకు తెలియజేసినట్లు చెప్పాడు. తనని క్రికెటర్‌గా తీర్చిదిద్దిన తండ్రిని ఈ స్థితిలో వదిలి వెళ్లలేని దీపక్ స్పోర్ట్స్ టాక్‌తో మాట్లాడుతూ […]
Heavy Rains in AP Due to Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాన్ వాయుగుండంగా బలహీనపడింది. ఈ వాయుగుండం ఈరోజు మధ్యాహ్నానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశముంది. మిచాంగ్ ప్రభావంతో ఏపీలో ప్రస్తుతం వర్షాలు ఉరుస్తున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు వద్ద వైరా, […]
Heavy Crop damage in AP: మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఏడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కాలనీలు జలమయంగా మారాయి. గోరింకల డ్రైన్ పొంగి పొర్లుతోంది. వర్షాలకు వరి చేలు మొత్తం నేలకొరిగాయి. చేతికి అందివచ్చిన పంటలు దెబ్బ తినడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లితో పాటు అనేక మండలాలలో వరి చేలు దెబ్బతిన్నాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు అంటున్నారు. మిచాంగ్ తుఫాన్ […]