A Car Destroying Traffic Barricades at Praja Bhavan: బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం (డిసెంబర్ 23) తెల్లవారుజామున 3 గంటల సమయంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు (టీఎస్ 13 ఈటీ 0777) ప్రజాభవన్ ఎదుట ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా.. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద సమయంలో కారులో […]
నేడు కృష్ణా జిల్లాలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పర్యటించనున్నారు. పామర్రు బెల్ పరిశ్రమ పరిశీలన, జిల్లా కార్యవర్గ సమావేశంలో పురంధరేశ్వరి పాల్గొననున్నారు. నేడు అనకాపల్లి మండలం కూండ్రం గ్రామంలో వంగవీటి రంగా విగ్రహాంను విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించనున్నారు. అనంతరం గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత పర్యటించనున్నారు. ఉదయం 11:00 గంటలకు కొవ్వూరు టౌన్లో […]
TodayGold and Silver Price in Hyderabad: బంగారం కొనేవారికి ధరలు షాకిస్తున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. గత 10 రోజుల్లో బంగారం ధరలు కేవలం ఒక్కరోజు మాత్రమే తగ్గాయి. దాంతో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారు ముందూవెనకా ఆలోచిస్తున్నారు. అలాంటి వారికి కాస్త ఊరట కలిగించే వార్త. దేశీయ మార్కెట్లో వరుసగా రెండో రోజు పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. […]
100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అందిస్తామనే నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గత వ్యవస్థలో తప్పులు జరిగాయని, వాటిని తాము సరిదిద్దుతామన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త ఆశలు, కొత్త నడవడికలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా పనిచేస్తుందని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజాపాలన జిల్లాస్థాయి సమన్వయ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనర్సింహ వచ్చారు. Also Read: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ […]
MP Bandi Sanjay Said BRS Will Lost Deposits in Parliament Elections 2024: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీదారు కానేకాదని, డిపాజిట్లు గల్లంతవ్వడం తథ్యం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించినా కేసీఆర్ కొడుకుకు అహంకారం తగ్గలేదని, ఇంకా అధికారంలో ఉన్నట్లుగా భ్రమలో ఉంటూ మాట్లాడుతున్నాడని విమర్శించారు. శ్వేత పత్రం, స్వేద పత్రం అంటూ అక్షరాలు మార్చి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ […]
KTR Review Meeting With Chevella BRS Leaders: లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ చేవెళ్ల పార్టీ నేతలకు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోని మెజార్టీని కాపాడుకుంటూ.. లోక్సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలన్నారు. ఓడిపోయాం అని నిరాశ పడకుండా.. ముందుకు సాగాలని కేటీఆర్ నేతలతో చెప్పారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం అయ్యారు. […]
KA Paul Meets CM Revanth Reddy; తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో కేఏ పాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. జనవరి 30న జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డిని తాను ఆహ్వానించానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు కేఏ పాల్ తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తాను […]
KCR React on Nalgonda Road Accidents: నల్గొండ జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాల ఘటనలపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కేసీఆర్ కోరారు. అలానే మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. Also Read: Atal Bihari […]
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నివాళులర్పించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నేతలు వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అటల్ బిహారి వాజపేయి విశిష్ట సేవలు దేశానికి అందించారన్నారు. కోట్లాది ఇల్లు […]
Cyberabad CP Avinash Mahanthi React on Sunburn Parties: న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి స్పష్టం చేశారు. సన్ బర్న్ పార్టీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఇప్పటివరకు సన్ బర్న్ ఈవెంట్ కోసం ఎలాంటి దరఖాస్తులు తమకు అందలేదని తెలిపారు. ఆదివారం సెక్రటేరియట్లో జరిగిన మీటింగ్లో సన్ బర్న్ లాంటి ఈవెంట్స్పై చాలా స్ట్రిక్ట్గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నగర పోలీసులను ఆదేశించారు. దాంతో […]