CP Avinash Mahanthi: న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందే.. సన్ బర్న్‌కు అనుమతులు ఇవ్వలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyberabad CP Avinash Mahanthi React on Sunburn Parties: న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి స్పష్టం చేశారు. సన్ బర్న్ పార్టీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఇప్పటివరకు సన్ బర్న్ ఈవెంట్ కోసం ఎలాంటి దరఖాస్తులు తమకు అందలేదని తెలిపారు. ఆదివారం సెక్రటేరియట్‌లో జరిగిన మీటింగ్‌లో సన్ బర్న్ లాంటి ఈవెంట్స్‌పై చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నగర పోలీసులను ఆదేశించారు. దాంతో సిటీలో ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్‌పై పోలీసులు ఫోకస్ చేశారు.
Also Read: Medigadda Barrage: 29న మేడిగడ్డ బ్యారేజీకి మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు!
Also Read
గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ఏరియాల్లో గతంలో సన్ బర్న్ ఈవెంట్స్ జరిగాయి. ఈ ఈవెంట్స్‌లో డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్‌పై పోలీసులు ఫోకస్ చేశారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ… ‘ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు సన్ బర్న్ ఈవెంట్స్‌కి ఆన్‌లైన్‌లో టికెట్స్ ఉన్నాయని తెలిసింది. సన్ బర్న్ పార్టీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. సన్ బర్న్ ఈవెంట్ కోసం ఎలాంటి దరఖాస్తు రాలేదు. అనుమతి తీసుకోకుండా ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటాం. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించాం. న్యూ ఇయర్ ఈవెంట్స్ కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందే’ అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!