KTR Review Meeting With Chevella BRS Leaders: లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ చేవెళ్ల పార్టీ నేతలకు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోని మెజార్టీని కాపాడుకుంటూ.. లోక్‌సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలన్నారు. ఓడిపోయాం అని నిరాశ పడకుండా.. ముందుకు సాగాలని కేటీఆర్ నేతలతో చెప్పారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం అయ్యారు. […]
KA Paul Meets CM Revanth Reddy; తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కేఏ పాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. జనవరి 30న జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డిని తాను ఆహ్వానించానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు కేఏ పాల్ తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తాను […]
KCR React on Nalgonda Road Accidents: నల్గొండ జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాల ఘటనలపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కేసీఆర్ కోరారు. అలానే మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. Also Read: Atal Bihari […]
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వాజ్‌పేయి చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నివాళులర్పించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నేతలు వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అటల్ బిహారి వాజపేయి విశిష్ట సేవలు దేశానికి అందించారన్నారు. కోట్లాది ఇల్లు […]
Cyberabad CP Avinash Mahanthi React on Sunburn Parties: న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి స్పష్టం చేశారు. సన్ బర్న్ పార్టీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఇప్పటివరకు సన్ బర్న్ ఈవెంట్ కోసం ఎలాంటి దరఖాస్తులు తమకు అందలేదని తెలిపారు. ఆదివారం సెక్రటేరియట్లో జరిగిన మీటింగ్‌లో సన్ బర్న్ లాంటి ఈవెంట్స్‌పై చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నగర పోలీసులను ఆదేశించారు. దాంతో […]
Ministers To Visits Medigadda Barrage on December 29: డిసెంబర్ 29న తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. 29న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మంత్రులు బయల్దేరి.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాలను గురించి మంత్రులు వివరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు […]
Huge Rush At Yadadri Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ప్రత్యేకదర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా.. ఉచిత దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతోంది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అధ్యయనోత్సవ భాగంగా నేడు మూడవ […]
సింగరేణి కార్మికులకు రూ. 20 లక్షల వడ్డీలేని రుణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సింగరేణి కార్మికులను తాను ఆదుకుంటానని, కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం కృషి చేస్తానన్నారు. గడిచిన పది సంవత్సరాలు నామవాత్ర ఉద్యోగాలు నియమించారని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను చేపట్టే కార్యక్రమం ప్రారంభించిందని పొంగులేటి చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పుకొచ్చారు. ఇల్లందు సింగరేణి జెకే ఓపెన్ కాస్ట్ ఆఫీస్ […]
5 Months Old Boy Dies in Street Dogs Attack in Shaikpet: వీధి కుక్కలు మరో చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్నాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు, ఖమ్మంలోని రఘునాథపాలెం మండలంలో 5 ఏళ్ల చిన్నారి కుక్కల దాడిలో మృతి చెందిన ఘటనలు ఇంకా మన కళ్ల ముందు మెదలాడుతుండగానే.. తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో వీధి కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల దాడిలో […]
Five Peoples Test Positive for COVID-19 in Same Family: భారత దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాపకింద నీరులా కరోనా వ్యాప్తి చెందుతోంది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అందులో ఒకరు వరంగల్ ఎంజీఎంలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. Also Read: Road […]