IIT Kanpur Professor died after suffering a cardiac arrest: ఐఐటీ కాన్పూర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకొంది. సీనియర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ (53) యూనివర్సిటీలో ప్రసంగిస్తూ గుండెపోటుతో మరణించారు. ఆడిటోరియంలో జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ సమీర్.. గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకోగా.. ఐఐటీ కాన్పూర్ అధికారులు శనివారం వెల్లడించారు. ‘మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి’ అని విద్యార్థులకు ఆయన చివరి […]
Night temperatures Falling Down in Telangana: తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఈశాన్యం నుంచి గాలులు వీస్తుండటంతో.. గత పది రోజులుగా రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. శనివారం రాత్రి పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు సొనాలలో 8.5 ఉష్ణోగ్రతలు నమోదు. బేల 9.2, బజార్ హత్నూర్‌లో 9.3, పొచ్చెరలో 9.5, […]
29 MMTS Trains Cancelled in Hyderabad: హైదరాబాద్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో పలు మార్గాల్లో నడువనున్న 29 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. పలు ఆపరేషనల్ కారణాలతో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రయాణికులు తమకు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. సికింద్రాబాద్, లింగంపల్లి, ఉందానగర్, ఫలక్‌నుమా మార్గాల్లో నడిచే రైళ్లు రద్దు అయ్యాయి. లింగంపల్లి-ఉందానగర్ (47213), ఉందానగర్-లింగంపల్లి (47211), ఉందానగర్-సికింద్రాబాద్ (47246), […]
Karnataka Logs 104 New Coronavirus Cases: భారత దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగిపోతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో గత 24 గంటల్లో 104 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 271కి చేరుకుంది. కర్ణాటకలో డిసెంబరు 15 నుంచి నాలుగు కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 5.93%గా ఉంది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు […]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అటెండర్‌తో బూట్లు మోయించారనే ఆరోపణలు కలెక్టర్ భవేశ్ మిశ్రా ఎదుర్కొంటున్నారు. క్రిస్మస్ 2023 సందర్భంగా స్థానిక చర్చిలో జరిగిన వేడుకలకు కలెక్టర్ భవేశ్ మిశ్రా బూట్లతోనే ప్రార్థన మందిరంలోకి వెళ్లారు. బూట్లతో ప్రార్థన మందిరంలోకి వెళ్లడం సరికాదని గ్రహించిన కలెక్టర్.. పక్కనే ఉన్న అటెండర్ దఫేదార్ చేతికి తన బూట్లను ఇచ్చారు. Also Read: Mulugu Bokka: మూలుగ బొక్క కోసం లొల్లి.. […]
Marriage was Cancelled for Mooluga Bokka in Telangana: ‘బలగం’ సినిమాలో మూలుగ బొక్క కోసం బావ బామ్మర్దుల మధ్య జరిగే గొడవ అందరికీ గుర్తుండే ఉంటుంది. పెళ్లి అనంతరం పండగకు అత్తారింటికి వచ్చిన అల్లుడికి మూలుగ బొక్క వేయకపోవడంతో బావ, బామ్మర్దుల మధ్య జరిగిన గొడవ.. ఆ కుటుంబంలో కలహాలకు దారి తీస్తుంది. అచ్చం అలాగే మూలుగ బొక్క కోసం జరిగిన గొడవ.. చిరవకు పెళ్లి సంబంధం రద్దు అయ్యే వరకు వెళ్లింది. ఈ […]
CM Revanth Reddy meeting with Collectors and SP’s Today: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నేడు జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడనున్నారు. ధరణి సమస్యలు, మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, ప్రజావాణి విజ్ఞప్తులు, దరఖాస్తులు, గ్రామ సభలు.. మొదలైన వాటిపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సీఎంగా […]
Karnataka Govt Plans Indira Canteens at Bangalore Airport: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ అన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌తో పోలిస్తే దాదాపు డబుల్ రేట్స్ అక్కడ ఉంటాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కప్పు టీ లేదా కాఫీకి రూ. 200 నుంచి రూ. 500 ఉంటుంది. అదే భోజనం చేయడానికి రూ. 500-1,000 చెల్లించుకోవాల్సిందే. అధిక ధరలతో ఇబ్బందిపడుతున్న ప్రయాణికులకు ఓ శుభవార్త. బెంగుళూరు విమానాశ్రయంలో కేవలం 10 […]
Gold Price Hits All-Time Record in India: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ధర తగ్గుతుందనుకునే లోపే ఇంకా పైపైకి ఎగబాకుతున్నాయి. మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు.. జీవన కాల గరిష్టాల్ని నమోదు చేశాయి. బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 200 ఎగబాకగా.. ఏకంగా రూ. 58 వేల మార్కు దాటేసింది. స్వచ్ఛమైన బంగారం ధర 24 క్యారెట్లపై రూ. 260 […]
Search operation begin in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో రెండు సైనిక వాహనాలపై గురువారం ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు వీర మరణం పొందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు ముందే ప్లాన్ చేసి.. కొండలపై నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. దాడికి ముందు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పూంఛ్ […]