కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతేకాదు కేప్‌టౌన్‌లో తొలి టెస్టు విజయాన్ని భారత్ నమోదు చేసింది. భారత్ విజయంలో పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్స్ పడగొట్టాడు. మొత్తంగా రెండో టెస్టులో సిరాజ్ 7 వికెట్లు, […]
Yashasvi Jaiswal, Suryakumar Yadav nominees for ICC Awards 2023: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2023 ఏడాదికి గానూ అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు అవార్డులు ఇవ్వడానికి సిద్ధమైంది. వన్డే, టీ20, ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ఐసీసీ ఇవ్వనుంది. మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు కోసం ఐసీసీ నలుగురు ప్లేయర్లను నామినేట్ చేయగా.. అందులో ముగ్గురు భారత్ నుంచి ఉండటం విశేషం. విరాట్ కోహ్లీ, […]
Virat Kohli Wins Hearts With Priceless Gesture For Dean Elgar: దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దాంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్‌తో దక్షిణాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్లో ఆఖరి టెస్ట్ ఆడిన ఎల్గర్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్స్ అందించారు. […]
హీరో శివాజీ చాలాకాలం గ్యాప్ తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివాజీ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘#90’s’. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సిరీస్ ద్వారా శివాజీ ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజశేఖర్ మేడారం నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. […]
WTC Points Table 2025 Latest: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఏకంగా ఐదో స్ధానం నుంచి టాప్ ప్లేస్‌కు చేరింది. భారత జట్టు పాయింట్ల శాతం 54.16గా ఉంది. డబ్ల్యూటీసీ సైకిల్లో […]
Rohit Sharma on Cape Town Pitch: భారత్ పిచ్‌లపై విమర్శలు చేసే వారికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇది కూడా క్రికెట్ పిచే కదా అని, ఆడింది మ్యాచే కదా అని విమర్శించాడు. కేప్‌టౌన్‌లో ఏం జరిగిందో మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి కనబడిందనే అనుకుంటున్నానని.. మరి దీనికేం రేటింగ్ ఇస్తారు? అని ప్రశ్నించారు. భారత్‌కు వచ్చినప్పుడు ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఆపితే మంచిదని రోహిత్ ఫైర్ అయ్యాడు. కేప్‌టౌన్ […]
తన హృదయంలో కేప్‌టౌన్ మైదానానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. టెస్ట్ మ్యాచ్ ఇంత తొందరగా ముగుస్తుందని తాను ఊహించలేదని, టెస్టు క్రికెట్ సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుందన్నాడు. విదేశీ పరిస్థితుల్లో రాణించాలంటే నిలకడగా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని బుమ్రా చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా (6/61) ప్రొటీస్ జట్టు పతనాన్ని శాసించాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు […]
Jasprit Bumrah Takes 5 Wickets in IND vs SA 2nd Test: కేప్‌టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజైన గురువారం సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికాకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా షాక్ ఇచ్చాడు. మొదటి సెషన్ తొలి ఓవర్లనే ఓవర్ నైట్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్హామ్ (11)ను ఔట్ చేశాడు. కాసేపటికే కైల్ వెర్రెయిన్నే (9)ను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఆదిలోనే రెండు […]
IND vs PAK Match in T20 World Cup 2024: ఈ ఏడాదిలో టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న విషయం తెలిసిందే. యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరిగే ఈ పొట్టి టోర్నీలో 20 జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. వన్డే ప్రపంచకప్ 2023లో తలపడ్డ దాయాదులు భారత్, పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌లో మరోసారి తలపడనున్నాయి. పొట్టి టోర్నీ కోసం అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు కాకున్నా.. క్రికెట్ వర్గాల ప్రకారం ఇండో-పాక్ మ్యాచ్ జూన్ 9న జరిగే […]
ICC changes stumping rule to stop DRS Misuse: క్రికెట్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. స్టంపౌట్ రూల్ విషయంలో ఐసీసీ కీలక మార్పులు చేసింది. స్టంపౌట్ విషయంలో థర్డ్ అంపైర్‌కు ఆన్ ఫీల్డ్ అంపైర్ రిఫర్ చేస్తే.. టీవీ అంపైర్ కేవలం స్టంపౌట్ మాత్రమే చెక్ చేయాలనే నిబంధనను తెచ్చారు. ఈ కొత్త నిబంధన ఫీల్డింగ్ టీమ్‌కు శాపంలా మారిందనే చెప్పాలి. అయితే ఇది బ్యాటర్లకు మాత్రం వరంగా మారింది. […]