AUS vs PAK: క్యాప్‌తో బంతిని ఆపినా.. 5 పరుగుల పెనాల్టీ ఇవ్వని క్రికెట్ ఆస్ట్రేలియా! కారణం ఏంటంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ పేరు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసి ఇప్పటికే నెట్టింట హాట్‌టాపిక్ అయిన ఆయుబ్.. ఈసారి క్యాప్‌తో బంతిని ఆపి మరోసారి వార్తలో నిలిచాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న చివరి టెస్టులో ఆయుబ్ బంతిని ఆపే క్రమంలో జారిపడి.. క్యాప్‌తో బంతిని ఆపాడు. అయినా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 5 పరుగుల పెనాల్టీ ఆసీస్ జట్టుకు ఇవ్వలేదు. ఇందుకు కారణంను సీఏ సోషల్ మీడియాలో వెల్లడించింది.
మూడో రోజు ఆటలో భాగంగా స్టీవ్ స్మిత్ బాదిన బంతిని బౌండరీకి వెళ్లకుండా ఆపే క్రమంలో సయీమ్ ఆయుబ్ జారిపడ్డాడు. ఆయుబ్ కిందపడిన సమయంలో క్యాప్ మైదానంలో పడగా.. బాల్ అందులోకి వెళ్ళింది. దాంతో బంతి బౌండరీ వెళ్లలేదు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా 5 పెనాల్టీ పరుగులు ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం ఆస్ట్రేలియాకు పెనాల్టీ రూపంలో 5 పరుగులు రావాల్సిందని చాలా మంది సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది.
Also Read
Also Read: T20 World Cup 2024: భారత అభిమానులకు గుడ్‌న్యూస్.. రోహిత్, కోహ్లీ రీఎంట్రీ!
‘పెనాల్టీ పరుగుల గురించి అడిగిన వారి కోసం ఈ సమాధానం. క్యాప్ కారణంగా బంతి బౌండరీ వెళ్లకుండా ఆగిపోయింది. ఇది ప్రమాదవశాత్తు (యాక్సిడెంటల్‌గా) జరిగిన పరిణామం. అంతేకాని ఫీల్డర్ ఉద్దేశపూర్వకంగా చేయలేదు. హెల్మెట్‌ల మాదిరి క్యాప్‌ను ఉద్దేశపూర్వకంగా మైదానంలో వదిలిపెట్టలేదు. అందుకే బ్యాటింగ్ జట్టుకు పెనాల్డీ పరుగులు ఇవ్వలేదు’ అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ సీఏతో ఏకీభవించాడు.
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!