Christian Oliver Dies: కరేబియన్ సముద్రంలో కూలిన విమానం.. హాలీవుడ్ నటుడు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Christian Oliver dies in Plane Crash: జర్మన్ సంతతికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ విమాన ప్రమాదంలో మరణించారు. ఒలివర్ సహా అతడి ఇద్దరు కుమార్తెలు విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో పైలట్ కూడా మృతి చెందాడు. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది మత్స్య కారులతో కలిసి మృతదేహాలను బయటికి తీశారు. వెకేషన్‌కు వెళుతుండగా ఈ విమాన ప్రమాదం సంభవించింది. ఒలివర్ మరణంతో హాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల ప్రకారం… వెకేషన్‌లో భాగంగా గురువారం క్రిస్టియన్ ఒలివర్ (51) తన కుటుంబంతో కలిసి గ్రెనడైన్స్‌లోని బెక్వియా ద్వీపం విమానాశ్రయం నుంచి సెయింట్ లూసియాకు వెళ్తున్నారు. బెక్వియాలో టేక్‌ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో విమానం కరీబియన్ సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒలివర్ (51), అతని కుమార్తెలు అన్నీక్ (10) మడితా క్లెప్సర్ (12) మరియు విమానం పైలట్ రాబర్ట్ సాక్స్ మృతి చెందారు.
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
Also Read: AUS vs PAK: వార్నర్ ఆఖరి పంచ్.. పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం! సిరీస్ క్లీన్‌స్వీప్
సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది మత్స్య కారుల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. పడవ ద్వారా స్థానిక మార్చురీకి మృతదేహాలను తరలించారు. వీరి మరణానికి ఖచ్చితమైన కారణాలను గుర్తించడానికి శవపరీక్షలు శుక్రవారం జరిగాయి. అవి ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఇక ‘ది గుడ్ జర్మన్’ అనే సినిమాతో ఒలివర్ వెండితెరకు పరిచయమయ్యారు. 2008లో యాక్షన్-కామెడీ చిత్రం ‘స్పీడ్ రేసర్’లో నటించారు. కెరీర్ ప్రారంభంలో టీవీ షోలు చేసిన ఒలివర్.. ఇప్పటివరకు 60కిపైగా సినిమాల్లో నటించారు. 30 ఏళ్ల కెరీర్‌లో టామ్ క్రూజ్ మరియు జార్జ్ క్లూనీలతో కలిసి సినిమాల్లో నటించారు. ఇటీవలే ఆయన ‘ఫరెవర్ హోల్డ్ యువర్ పీస్’ సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు.
తాజావార్తలు
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!