David Warner Reacts After His Baggy Green Cap Found: నాలుగు రోజుల క్రితం ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రెండు బ్యాగీ గ్రీన్ క్యాప్‌లను పోగొట్టుకున్నాడు. పాకిస్తాన్‌తో మూడో టెస్ట్ మ్యాచ్‌కు ముందు మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి వస్తుండగా ఈ క్యాప్‌లు మిస్ అయ్యాయి. 2011లో వార్నర్ తన అరంగేట్రం టెస్టులో ధరించిన బ్యాగీ గ్రీన్ క్యాప్.. సిడ్నీలోని టీమ్ హోటల్‌లో దొరికింది. అయితే అది ఎలా హోటల్‌కు వచ్చిందో ఎవరికీ తెలియదు. ఏదేమైనా తన బ్యాగీ గ్రీన్ క్యాప్‌లు దొరికినందుకు దేవ్ భాయ్ ఆనందం వ్యక్తం చేశాడు.
రెండు బ్యాగీ గ్రీన్ టోపీలున్న ఓ బ్యాగు సిడ్నీలోని హోటల్లోనే డేవిడ్ వార్నర్‌కు కనిపించింది. బ్యాగు తీసుకున్న వార్నర్.. తన టోపీలు దొరికిన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ‘నా బ్యాగీ గ్రీన్ టోపీలు దొరికాయి. ఈ విషయాన్ని మీకు చెప్పేందుకు చాలా సంతోషంగా, ఎంతో ఉపశమనంగానూ ఉంది. ఆ టోపీ ఎంత ప్రత్యేకమో ప్రతి క్రికెటర్‌కూ తెలుసు. ఈ సందర్భాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా. టోపీలు నా వరకూ చేరడానికి సాయపడ్డ అందరికీ రుణపడి ఉంటా. రవాణా సంస్థ క్వాంటస్‌కు, హోటల్‌కు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు’ అని వార్నర్ పేర్కొన్నాడు.
Also Read: Vaibhav Suryavanshi: 12 ఏళ్ల వయసులోనే అరంగేట్రం.. రికార్డుల్లో బీహార్ ఆటగాడు!
డేవిడ్ వార్నర్ కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న సంగతి తెలిసిందే. వార్నర్ 111 టెస్టులో 8,695 రన్స్ చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 335 నాటౌట్. వన్డే క్రికెట్‌కు సైతం దేవ్ భాయ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఈ తరుణమే ఆటకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఆసీస్ తరపున 161 వన్డేలు ఆడిన వార్నర్.. 6,932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 179.