Vaibhav Suryavanshi: 12 ఏళ్ల వయసులోనే అరంగేట్రం.. రికార్డుల్లో బీహార్ ఆటగాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Cricketer Vaibhav Suryavanshi created history in Ranji Trophy 2023-24: బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నాలుగో అతి పిన్నవయస్కుడైన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా శుక్రవారం (జనవరి 5) ముంబైతో మొదలైన మ్యాచ్‌లో వైభవ్ బీహార్ తరఫున బరిలోకి దిగాడు. 1942–43 సీజన్‌లో 12 ఏళ్ల 73 రోజుల వయసులో రాజ్‌పుతానా తరఫున అరంగేట్రం చేసిన అలీముద్దీన్‌కు అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు ఉంది.
బీహార్‌కు చెందిన ఎస్‌కే బోస్ 12 సంవత్సరాల 76 రోజుల వయస్సులో 1959–60 సీజన్‌లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. మొహమ్మద్ రంజాన్ 1937 సీజన్‌లో 12 ఏళ్ల 247 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ముగ్గురు వైభవ్ సూర్యవంశీ కంటే చిన్న వయసులోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. అయితే ఓ ఇంటరాక్షన్‌లో సూర్యవంశీ తన పుట్టినరోజు సెప్టెంబర్ 27న అని, 2023లో తనకు 14 ఏళ్లు నిండుతాయని పేర్కొన్నాడు.
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
Also Read: TS Traffic E-Challan: పెండింగ్ చలానా రాయితీ గడువు మరో ఐదు రోజులే!
వైభవ్ సూర్యవంశీ రంజీ అరంగేట్రానికి ముందు 2023 ఎడిషన్ కూచ్ బెహార్ ట్రోఫీలో బీహార్ తరఫున ఆడాడు. జార్ఖండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో వైభవ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 151, 76 రన్స్ చేశాడు. వైభవ్‌కు విధ్వంసకర బ్యాటర్‌గా పేరుంది. ముంబైతో జరిగే రంజీ మ్యాచ్‌లో వైభవ్ ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 67 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!