తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. టీఎస్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఉచిత పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఈ ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓ ప్రైవేట్ ఉద్యోగి పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని పిల్లో పేరొన్నారు. […]
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో బుధవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. మందు పార్టీ చేసుకుని ఇంటికి వస్తుండగా.. ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందారు. ఇద్దరి మరణానికి కల్తీ కల్లు కారణం అని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వేంటనే కల్తీ కల్లు దుకాణాన్ని మూసేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరమే ఇద్దరి మరణానికి గల కారణాలు తెలియరానున్నాయని పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… నవీన్, […]
Union Minister Kishan Reddy Praises Hanu Man Movie: టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా నటించిన తాజా సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ సినిమా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే వంద కోట్ల మైలురాయిని దాటిన ఈ సినిమా.. మరో మార్క్ దిశగా దూసుకెళుతోంది. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు […]
పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఓ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 108 సిబ్బంది నిరాకరించారు. 108 వాహనంలో డీజిల్ లేదని, తాము ఏం చేయలేమని చెప్పారు. ఇక చేసేది లేక బాధితురాలిని కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందించడంతో ఆ మహిళ ప్రాణాపాయం నుంచి బయట పడింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… మోమిన్‌పేట మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన సాలెమ్మ (33) […]
Virat Kohli Records First Golden Duck in T20Is: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అఫ్గన్ పేసర్ ఫరీద్ అహ్మద్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన విరాట్.. మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరకుండానే నిష్క్రమించాడు. తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో తొలిసారిగా […]
Most Hundreds in T20: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. హిట్‌మ్యాన్ 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 121 పరుగులు బాదాడు. 2019 తర్వాత టీ20 ఫార్మాట్లో తన తొలి సెంచరీ నమెదు చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ టీ20లలో రోహిత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ సెంచరీతో టీ20ల్లో రోహిత్ సరికొత్త […]
IND beat AFG in Second Super Over: అఫ్గానిస్థాన్, భారత్ జట్ల మధ్య నామమాత్రమనుకున్న మ్యాచ్.. సిక్సులు, ఫోర్లు, నరాలు తెగే ఉత్కంఠతో అభిమానులకు అసలైన మజాను అందించింది. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టి.. మంచి వినోదాన్ని పంచింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బుధవారం ఉత్కంఠ రేపిన మూడో టీ20లో రెండో సూపర్ ఓవర్లో అఫ్గానిస్థాన్‌ను భారత్ ఓడించింది. ముందుగా మ్యాచ్ టై (212 పరుగులు) కాగా.. తొలి సూపర్ ఓవర్ ఓవర్లో ఇరు జట్లు 16 […]
Steven Smith Out for 12 as Test Opener: రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం తొలి మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖవాజా (౩౦), కామెరాన్ గ్రీన్ (6) ఉన్నారు. విండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ 2 వికెట్లు తీశాడు. అయితే ఓపెనర్ అవతారం ఎత్తిన […]
Captain Miller Telugu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్నటించిన తాజా సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో యాక్షన్–థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రపంచవాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ జనవరి 25న ఏపీ, తెలంగాణలో విడుదల కానుంది. ఈ చిత్రంను తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ విడుదల చేస్తున్నాయి. కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్‌ను ఈరోజు […]
ప్రముఖ నటుడు సురేశ్ గోపీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కూతురు భాగ్య సురేశ్ వివాహం శ్రేయాస్ మోహన్‌తో జరిగింది. వీరి వివాహం బుధవారం ఉదయం 8.45 నిమిషాలకు కేరళలోని గురువాయూర్ ఆలయంలో చాలా సింపుల్‌గా జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, కొద్దిమంది నటీనటులు మాత్రమే ఆహరజయ్యారు. సురేశ్ గోపీ కూతురి వివాహంకు ప్రధాన నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని ఈరోజు ప్రధాని మోడీ సందర్శించారు. కేరళ […]