Kalti Kallu: గోదావరిఖనిలో విషాదం.. మందు పార్టీ అనంతరం ఇద్దరు స్నేహితుల దుర్మరణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో బుధవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. మందు పార్టీ చేసుకుని ఇంటికి వస్తుండగా.. ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందారు. ఇద్దరి మరణానికి కల్తీ కల్లు కారణం అని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వేంటనే కల్తీ కల్లు దుకాణాన్ని మూసేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరమే ఇద్దరి మరణానికి గల కారణాలు తెలియరానున్నాయని పోలీసులు చెప్పారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… నవీన్, రమేష్ ఇద్దరు స్నేహితులు. ఈ ఇద్దరు పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. రోజులానే బుధవారం పని ముగుంచుకుని.. అడ్డగుంటపల్లిలోని నంబర్ వన్ కల్లు డిపోలో ఇద్దరు పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం
నవీన్, రమేష్ నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నారు. ఆర్యవైశ్య నగర్ రాగానే రమేష్ కుప్పకూలాడు. దాంతో నవీన్ కంగారుపడ్డాడు. రమేష్‌ను ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు నవీన్ ప్రయత్నించాడు. అంతలోనే నవీన్ కూడా కిందపడిపోయాడు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
Also Read: Hanu Man: హీరో తేజ సజ్జాను అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!
నవీన్, రమేష్‌లను చుట్టుపక్కల వారు గమనించి గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరు మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. దాంతో నవీన్, రమేష్ కుటుంబంలో విషాద షాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం ఇద్దరి మరణానికి గల కారణాలు తెలియరానున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరి మరణానికి కల్తీ కల్లు కారణం అని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!