IND vs AFG: విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇదే తొలిసారి.. స్టేడియం మొత్తం గప్‌చుప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Records First Golden Duck in T20Is: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అఫ్గన్ పేసర్ ఫరీద్ అహ్మద్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన విరాట్.. మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరకుండానే నిష్క్రమించాడు. తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలిసారిగా గోల్డెన్ డక్ నమోదు చేశాడు. టీ20 ఇన్నింగ్స్‌లో ఎటువంటి పరుగులు చేయకపోవడం ఇది ఐదవసారి మాత్రమే.
టీ20 ప్రపంచకప్ 2024కు ముందు భారత్ ఆఖరిగా ఆడుతున్న ఈ సిరీస్‌తోనే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. దాదాపుగా 14 నెలల అనంతరం విరాట్ భారత టీ20 జట్టులోకి వచ్చాడు. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్‌కు దూరమైన కోహ్లీ.. రెండో మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. 16 బంతుల్లో 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే బెంగళూరులో జరిగిన మూడో టీ20లో మాత్రం విఫలమయ్యాడు. విరాట్ బ్యాటింగ్ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. రన్ మెషిన్ అవుట్ కాగానే స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది.
Also Read
Also Read: Rohit Sharma: టీ20ల్లో తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు!
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బుధవారం ఉత్కంఠ రేపిన మూడో టీ20లో రెండో సూపర్ ఓవర్లో అఫ్గానిస్థాన్‌ను భారత్ చిత్తుచేసింది. భారత్, అఫ్గాన్ జట్లు 212 పరుగులు చేయడంతో మ్యాచ్ టై కాగా.. తొలి సూపర్ ఓవర్ ఓవర్లో ఇరు జట్లు 16 పరుగులతో సమంగా నిలిచాయి. ఇక రెండో సూపర్ ఓవర్‌లో ముందుగా భారత్ 11 రన్స్ చేయగా.. అఫ్గాన్ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!