Union Minister Kishan Reddy Praises Hanu Man Movie: టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా నటించిన తాజా సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ సినిమా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే వంద కోట్ల మైలురాయిని దాటిన ఈ సినిమా.. మరో మార్క్ దిశగా దూసుకెళుతోంది. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు హీరో, చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హీరో తేజ సజ్జాను అభినందించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని హీరో తేజ సజ్జా కలిశారు. న్యూఢిల్లీలోని అయన నివాసంలో కలిసిన తేజను కిషన్ రెడ్డి అభినందించారు. దేశ వ్యాప్తంగా సన్సెషన్ సృష్టించిన హనుమాన్ చిత్రం సూపర్ హిట్ కావడం తనకు చాలా సంతోషంగా ఉందని కేంద్రమంత్రి అన్నారు. అయోధ్యలోని భగవాన్ శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ సందర్బంగా.. భవ్య రామ మందిరానికి ప్రతి టిక్కెట్టు నుండి రూ. 5 విరాళంగా ఇవ్వడం అభినందించదగ్గ విషయమని అన్నారు. తన నివాసానికి వచ్చిన హీరో తేజను కిషన్ రెడ్డి సత్కరించారు.
Also Read: 108 Ambulance: సహకరించని 108 సిబ్బంది.. ప్రైవేటు ఆటోలో ఆస్పత్రికి బాధితురాలి తరలింపు!
హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు విమర్శలు ప్రసంశలు అందుకుంది. ఈ సినిమాలో అమృతా అయ్యర్ కథానాయికగా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, సముద్రఖని, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషించారు. గౌరా హరి-అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంయుక్తంగా మ్యూజిక్ అందించారు.