Most Hundreds in T20: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. హిట్‌మ్యాన్ 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 121 పరుగులు బాదాడు. 2019 తర్వాత టీ20 ఫార్మాట్లో తన తొలి సెంచరీ నమెదు చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ టీ20లలో రోహిత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ సెంచరీతో టీ20ల్లో రోహిత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు 151 మ్యాచ్‌లు ఆడి 5 సెంచరీలు బాదాడు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (60 మ్యాచ్‌లలో 4 సెంచరీలు), హార్డ్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ (100 మ్యాచ్‌లలో 4 సెంచరీలు)లు ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. సబావూన్ డేవిజీ, కోలిన్ మున్రోలు మూడు సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read: IND vs AFG: డబుల్ ‘సూపర్’ ఓవర్.. అఫ్గాన్‌పై భారత్ త్రిల్లింగ్ విక్టరీ!
మూడో టీ20లో రోహిత్ శర్మ సహా రింకూ సింగ్ కూడా విధ్వంసం సృష్టించాడు. 39 బంతుల్లో 69 పరుగులు చేశాడు. రింకూ ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉండటం విశేషం. అంతర్జాతీయ టీ20లలో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యంను (190 నాటౌట్) రోహిత్, రింకూ నమోదు చేశారు. 2022లో ఐర్లాండ్‌పై సంజూ శాంసన్- దీపక్ హుడా 176 రన్స్ చేశారు.