Captain Miller Telugu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌నటించిన తాజా సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో యాక్షన్–థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రపంచవాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ జనవరి 25న ఏపీ, తెలంగాణలో విడుదల కానుంది. ఈ చిత్రంను తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ విడుదల చేస్తున్నాయి.
కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ట్రైలర్‌ను టాలీవుడ్ అగ్ర హీరోలు అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్ నేటి సాయత్రం ఆరు గంటలకు లాంఛ్ చేయనున్నారు. ఇందుకుసంబందించి ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ధనుష్, శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్ ఫైరింగ్ మూడ్‌లో ఉన్న లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
Also Read: PM Modi: గుడిలో సురేశ్ గోపి కూతురి వివాహం.. హాజరైన ప్రధాని మోడీ!
విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో ఈ సినిమా తెరకెక్కింది. కెప్టెన్ మిల్లర్ తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు ఓవర్సీస్‌లో వాహ చాటుతోంది. ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటించగా.. నివేదితా సతీశ్, ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించాడు. ధనుష్‌కి తెలుగులో మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే.