Rohit Sharma React on India Team for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 ముందు అఫ్గానిస్థాన్‌తో ఆఖరి పొట్టి సిరీస్‌ను భారత్ ఆడేసింది. ఇక జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరిగే పొట్టి కప్పులోనే నేరుగా భారత జట్టు బరిలోకి దిగనుంది. అయితే టీ20 ప్రపంచకప్ కోసం ఇంకా భారత జట్టు ఖరారు కాలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. కానీ పొట్టి టోర్నీలో ఆడే 8-10 ఆటగాళ్లెవరో తమ […]
Suryakumar Yadav Surgery: టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ సర్జరీ సక్సెస్ అయింది. స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్న సూర్య.. శస్త్రచికిత్స కోసం ఇటీవల జర్మనీ వెళ్లాడు. బుధవారం అతడికి వైద్యులు సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన ఫొటోను సూర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. అతి త్వరలో పునరాగమనం చేస్తా అని పేర్కొన్నాడు. ‘శస్త్రచికిత్స […]
అద్దంకి దయాకర్‌కు ఇచ్చిన మాట సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని జాతీయ మాలమహానాడు తెలంగాణ అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. పదేపదే అద్దంకిని అవమానించడం సమంజసం కాదని, తెలంగాణ ఉద్యమకారుడిని కాంగ్రెస్ అవమానపరుస్తుందన్నారు. అద్దంకి రాజకీయ ఎదుగుదలను అడ్డుకునే శక్తులను బయటపెట్టాలని పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు. అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంపై జాతీయ మాలమహానాడు ఆందోళనకు దిగింది. ట్యాంక్ బండ్ అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లి సుధాకర్ మాట్లాడారు. […]
కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని, ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోని ప్రభుత్వంపైన ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతుబంధు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి గ్రామం నుంచి రాష్ట్రస్థాయి దాకా పెద్ద ఎత్తున అన్ని స్థాయిలలో ప్రాతినిథ్యం ఉందని, ఇంతటి బలమైన పార్టీ తిరిగి గెలుపు […]
పార్టీలు మారే చరిత్ర తనది కాదని, పార్టీ మారుతున్నట్టు వచ్చే అసత్య ప్రచారాలను అస్సలు నమ్మొద్దని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేష్ అన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేని కొంతమంది దద్దమ్మలు, పిరికిపందలు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరూరి రమేష్ మాట మిద నిలబడే వ్యక్తి అని, నమ్ముకున్న కార్యకర్తని కంటికిరెప్పలా కాపాడుకునే వ్యక్తి అని తెలిపారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం ఎవరిని నిలబెట్టినా.. జిల్లా అద్యక్షునిగా భారీ […]
ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ఇంకా బ్రతికే ఉందంటే అది ఎన్టీఆర్ గారు ఇచ్చిన క్రమశిక్షణా, స్ఫూర్తి అని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు రాణిస్తున్నారు అంటే అది ఎన్టీఆర్ నేర్పిన నైపుణ్యం అని పేర్కొన్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని తన లాంటి చాలా మందిని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారని రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సభలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా […]
అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక ఎయిర్ క్రాఫ్ట్‌లను కొనుగోలు చేస్తోందని.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రధాని సంకల్పించారని, ఆ దిశగా సరలీకరిస్తున్నామని జ్యోతిరాదిత్య తెలిపారు. బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024’ వైమానిక ప్రదర్శనను గురువారం ఆయన ఆరంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు. […]
బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024’ వైమానిక ప్రదర్శన ప్రారంభం అయింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆరంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏవియేషన్ రంగనిపుణులు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు వింగ్స్ ఇండియా 2024 జరగనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. […]
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించి ఏఐజీ ఆసుపత్రి వైద్యులను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. తమ్మినేని గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం వెంట మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ […]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. టీఎస్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఉచిత పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఈ ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓ ప్రైవేట్ ఉద్యోగి పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని పిల్లో పేరొన్నారు. […]