ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ఇంకా బ్రతికే ఉందంటే అది ఎన్టీఆర్ గారు ఇచ్చిన క్రమశిక్షణా, స్ఫూర్తి అని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు రాణిస్తున్నారు అంటే అది ఎన్టీఆర్ నేర్పిన నైపుణ్యం అని పేర్కొన్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని తన లాంటి చాలా మందిని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారని రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సభలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పాల్గొనున్నారు.
‘నేను ఈ జిల్లా ఆడబిడ్డను. నాకు కొత్త కొత్త బిరుదులు ఇచ్చి నన్ను ఈ ప్రాంతానికి దూరం చేయొద్దు. నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించిన నేత ఎన్టీఆర్. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని నాలాంటి చాలా మందిని ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. నా పార్టీలో ఉన్న ఏకైక మగాడు రేణుకా అనే వారు. ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా.. ఇంకా బ్రతికే ఉందంటే అది ఎన్టీఆర్ గారు ఇచ్చిన క్రమశిక్షణా, స్ఫూర్తి. రాజకీయాల్లో కొన్ని మార్పులుండొచ్చు, గోడలు మారొచ్చు కానీ పునాది మారదు. అందుకే నేను ఈరోజు వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాను’ అని రేణుకా చౌదరి అన్నారు.
Also Read: Wings India 2024: సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం: జ్యోతిరాదిత్య సింధియా
‘ ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు రాణిస్తున్నారు అంటే అది ఎన్టీఆర్ నేర్పిన నైపుణ్యం. 10 ఏళ్ల రాక్షస పాలనకు టీడీపీ మద్దతుతో బీఆర్ఎస్ వాళ్లను ఇంటికి తరిమాం. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటాను. వర్ధంతి సభలో నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి తెలిపారు.