Suyash Prabhudessai likely to replace Virat Kohli: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టులకు అతడు దూరమయ్యాడు. జనవరి 25న ఆరంభం అయ్యే తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తుండగా.. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ రెండు టెస్టులకు విరాట్ స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది […]
BCCI Awards 2024: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, భారత పురుషుల క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రిలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్మానించనుంది. హైదరాబాద్‌లో ఈరోజు జరిగే బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో 2023 మేటి క్రికెటర్ (క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023) అవార్డుతో గిల్‌ను, జీవితకాల సాఫల్య పురస్కారంతో రవిశాస్త్రిని సత్కరించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా 2019 తర్వాత […]
India Star Virat Kohli Out from first two England Tests: తెలుగు క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్. ఇంగ్లండ్‌తో హైదరాబాద్, వైజాగ్ వేదికలుగా జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తప్పుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ ప్రకటనలో తెలిపింది. విరాట్ దూరం కావడానికి కారణంపై ఊహాగానాలు అస్సలు చేయొద్దని మీడియా, అభిమానులను బీసీసీఐ కోరింది. ఐదు టెస్టుల […]
Rishabh Pant, Ishan Kishan in contention for T20 World Cup 2024 Said Rahul Dravid: టీ20 ప్రపంచకప్ 2024 ముందు భారత్ ఆఖరి పొట్టి సిరీస్ ఆడేసింది. ఇక ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అనంతరం భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2024లో ఆడనున్నారు. ఆపై యూఎస్, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతారు. ఈ పొట్టి టోర్నీలో ఎవరికి అవకాశం దక్కుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […]
Ramam Raghavam Movie First Look Out: ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో, కమెడియన్ ధన్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి ‘రామం రాఘవం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రామం రాఘవం ఫస్ట్ లుక్‌ను ఇరవై రెండు […]
BCCI plans IPL 2024 from March 22 to May 26: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 17వ సీజన్‌కు సంబందించిన షెడ్యూల్ దాదాపు ఖరారైంది. 2024 మార్చి 22న ఐపీఎల్ ప్రారంభించేందుకు బీసీసీఐ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇక మే 26న ఫైనల్ జరిగేలా షెడ్యూల్ రూపొందించిందని సమాచారం. 17వ సీజన్‌కు సంబందించిన షెడ్యూల్‌పై బీసీసీఐ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. మార్చిలోనే సార్వత్రిక ఎన్నికలు […]
Victoria Azarenka knocked out by Dayana Yastremska in Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. వరల్డ్ నంబర్ 1 ఇగా స్వియాటెక్ మూడో రౌండ్లోనే నిష్క్రమించగా.. తాజాగా రెండుసార్లు చాంపియన్, బెలారస్ భామ విక్టోరియా అజరెంకకు షాక్ తగిలింది. సోమవారం జరిగిన నాలుగో రౌండ్లో 93వ ర్యాంకర్, ఉక్రెయిన్‌కు చెందిన డయానా యస్ట్రెమస్క చేతిలో అజరెంక ఓడిపోయింది. 7-6(6), 6-4తో అజరెంకను డయానా మట్టికరిపించింది. ఈ మ్యాచ్ 2 […]
Keshav Maharaj React on Ram Mandir PranPrathistha: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మరికొద్ది సేపట్లో జరగనుంది. అయోధ్య గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుదీరబోతున్నాడు. మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దాంతో 500 ఏళ్ల నాటి హిందువుల కల నెరవేరనుంది. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ కేశవ్ మహరాజ్ స్పందించాడు. భారత్‌కు ప్రత్యేక శుభాకాంక్షలను తెలిపాడు. ప్రాణప్రతిష్ఠ […]
Telangana High Court Verdict on VYooham Movie Censor Certificate: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమాపై పలు దఫాలు విచారణ చేపట్టిన హైకోర్టు నేడు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్‌ను తిరిగి సెన్సార్ బోర్డుకు హైకోర్టు పంపించింది. మూడు వారాల్లో వ్యూహం సినిమాను మళ్లీ పరిశీలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వ్యూహం సినిమా […]
Most Sixes Record for India in Test Cricket: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జనవరి 25 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే ఇరు జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ఆదివారం ఇంగ్లీష్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. నేడు ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా […]