IPL 2024 Schedule: ఐపీఎల్ 2024 షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆందోళనలో బీసీసీఐ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI plans IPL 2024 from March 22 to May 26: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 17వ సీజన్‌కు సంబందించిన షెడ్యూల్ దాదాపు ఖరారైంది. 2024 మార్చి 22న ఐపీఎల్ ప్రారంభించేందుకు బీసీసీఐ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇక మే 26న ఫైనల్ జరిగేలా షెడ్యూల్ రూపొందించిందని సమాచారం. 17వ సీజన్‌కు సంబందించిన షెడ్యూల్‌పై బీసీసీఐ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. మార్చిలోనే సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో.. ఎలక్షన్ డేట్స్ వచ్చాకే ఐపీఎల్ 2024 షెడ్యూల్‌ను వెల్లడించాలని బీసీసీఐ భావిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 2024ని విదేశాల్లో నిర్వహిస్తారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం భారత్‌లోనే టోర్నీ జరిగేలా చూస్తోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ఆ మ్యాచ్‌లను మరో చోటికి మార్చే ఆలోచనలో బీసీసీఐ ఉందట. ఇక విదేశీ ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ ఆందోళన చెందుతోంది. 2024 టీ20 ప్రపంచకప్ జూన్ 1న మొదలుకానుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న జరగనుంది. విశ్రాంతి తీసుకోవడానికి ఈ సమయం భారత ఆటగాళ్లకు సరిపోతుంది. అయితే జూన్ 2, 3, 4 తేదీలలో కొన్ని టాప్ జట్లకు మ్యాచ్‌లు ఉన్నాయి. దాంతో తమ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బోర్డులు భావిస్తే.. ఫైనల్‌కు విదేశీ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను ఫిబ్రవరి 22 నుంచి మార్చి 17 వరకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. డబ్యూపీఎల్ 2024 మ్యాచ్‌లన్నీ బెంగళూరు, ఢిల్లీ వేదికగా జరగనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో 2-3 రోజుల్లో విడుదల కానుంది. మొదటి సీజన్ ముంబైకి మాత్రమే పరిమితమవ్వగా.. ఈ సీజన్‌కు రెండు వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి. మొదటి భాగం మ్యాచ్‌లు బెంగళూరులో.. రెండోవ భాగం మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నట్టు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ మాత్రం ఢిల్లీలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభ సీజన్‌లో ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!