Victoria Azarenka knocked out by Dayana Yastremska in Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. వరల్డ్ నంబర్ 1 ఇగా స్వియాటెక్ మూడో రౌండ్‌లోనే నిష్క్రమించగా.. తాజాగా రెండుసార్లు చాంపియన్, బెలారస్ భామ విక్టోరియా అజరెంకకు షాక్ తగిలింది. సోమవారం జరిగిన నాలుగో రౌండ్‌లో 93వ ర్యాంకర్, ఉక్రెయిన్‌కు చెందిన డయానా యస్ట్రెమస్క చేతిలో అజరెంక ఓడిపోయింది. 7-6(6), 6-4తో అజరెంకను డయానా మట్టికరిపించింది. ఈ మ్యాచ్ 2 గంటల 7 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది.
విక్టోరియా అజరెంకాను ఓడించిన 23 ఏళ్ల డయానా యస్ట్రెమస్క.. మొదటిసారి గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఎమ్మా రాడుకాను (2021 యూఎస్ ఓపెన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ క్వార్టర్-ఫైనల్‌కు చేరుకున్న మొదటి క్వాలిఫైయర్ డయానా కావడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్ రౌండ్ 1లో వింబుల్డన్ ఛాంపియన్ మార్కెటా వొండ్రూసోవాపై అద్భుత విజయాన్ని డయానా అందుకుంది. తర్వాతి రౌండ్లలో వర్వారా గ్రాచెవా, ఎమ్మా నవారోలను ఓడించింది. క్వార్టర్ ఫైనల్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన లిండా నోస్కోవాతో డయానా తలపడనుంది. గ్రాండ్‌స్లామ్‌ల్లో వీరిద్దరూ తలపడడం ఇదే తొలిసారి.
From qualifying to QUARTERFINALS 🙌@D_Yastremska delivers her best-ever Grand Slam result!#AusOpen • @wwos • @espn • @eurosport • @wowowtennis pic.twitter.com/wCR1plg9Ea
— #AusOpen (@AustralianOpen) January 22, 2024