Ramam Raghavam Movie First Look Out: ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో, కమెడియన్ ధన్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి ‘రామం రాఘవం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రామం రాఘవం ఫస్ట్ లుక్‌ను ఇరవై రెండు మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేశారు. నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సముద్రఖనితో పాటు అతడు కూడా నటిస్తున్నాడు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో తండ్రి కొడుకులుగా సముద్రఖని, ధనరాజ్ కనిపిస్తున్నారు. ఇంటెన్స్‌తో కూడిన పోస్టర్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఇదివరకు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నామని దర్శకుడు ధన్ రాజ్ తెలిపాడు. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి, శ్రీనివాస రెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్నారు.
Also Read: IPL 2024 Schedule: ఐపీఎల్ 2024 షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆందోళనలో బీసీసీఐ!
రామం రాఘవం చిత్రానికి విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను సమకూర్చగా.. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంకు మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ కాగా.. దుర్గా ప్రసాద్ కెమెరామెన్. హైదరాబాద్, చెన్నై, అమలాపురం, రాజమండ్రి, రాజోలు, పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రామం రాఘవం సినిమా తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.
జగమంతా రామమయం 🙏🏻 ఇలాంటి అద్భుతమైన రోజు నా సినిమా టైటిల్ రిలీజ్ చేయడం నా పూర్వజన్మ సుకృతం 🙏🏻Presenting the first look poster of
Love that knows no boundaries 💞
A tale of a father and son!🧡🧡@thondankani @DhanrajOffl @Prudhvi_dir @DirPrabhakar #RR #RamamRaghavam pic.twitter.com/zbQ4u8PXJ7— Dhanraj koranani (@DhanrajOffl) January 22, 2024