Rishabh Pant, Ishan Kishan in contention for T20 World Cup 2024 Said Rahul Dravid: టీ20 ప్రపంచకప్ 2024 ముందు భారత్ ఆఖరి పొట్టి సిరీస్ ఆడేసింది. ఇక ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అనంతరం భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2024లో ఆడనున్నారు. ఆపై యూఎస్, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతారు. ఈ పొట్టి టోర్నీలో ఎవరికి అవకాశం దక్కుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఫ్గనిస్థాన్ సిరీస్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. 8-10 తమ దృష్టిలో ఉన్నారని చెప్పాడు. యువ క్రెకెటర్లు ఇషాన్ కిషన్, రిషభ్ పంత్‌లు కూడా పొట్టి టోర్నీ రేసులో ఉన్నారని కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.
అఫ్గనిస్థాన్ టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్, రిషభ్ పంత్‌లకు చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైన ఇషాన్ అర్ధాంతరంగా వైదొలిగాడు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతడిని అఫ్గనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్‌లో తొలి రెండు టెస్టులకు ఎంపిక చేయలేదని వార్తలు వచ్చాయి. కారు యాక్సెంట్‌కు గురైన పంత్ మోకాలి సర్జరీ నుంచి కోలుకుంటున్నాడు. పంత్ 17వ సీజన్ ఐపీఎల్‌తో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరికీ టీ20 ప్రపంచకప్‌లో చాన్స్ లేనట్టేననే వార్తలు వచ్చాయి. తాజాగా భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టీ20 ప్రాపంచకప్ స్క్వాడ్‌పై హింట్ ఇచ్చాడు.
Also Read: Ramam Raghavam: ‘రామం రాఘవం’ ఫస్ట్ లుక్ విడుదల!
‘టీ20 ప్రాపంచకప్ 2024 కోసం మాకు వికెట్ కీపింగ్ ఆప్షన్లు చాలానే ఉన్నాయి. అఫ్గనిస్థాన్ సిరీస్‌లో ఆడిన సంజూ శాంసన్, జితేశ్ శర్మలతో పాటు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్‌లు పొట్టి టోర్నీకి అందుబాటులో ఉన్నారు. టీ20 ప్రపంచకప్‌లు ఇంకా చాలా సమయం ఉంది. ఆలోపు ఉత్తమ కీపర్లను ఎంపిక చేస్తాం’ అని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. ఐపీఎల్ 2024 ఫామ్ ఆధారంగా భారత టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.