23 students scored 100 NTA score in session 1: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2024 సెషన్-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. పేపర్ -1 (బీఈ/బీటెక్) ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించారు. ఈ 23 మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ నుంచి […]
Former Team India Captain Dattajirao Gaekwad Passes Away: భారత క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ కన్నుమూశారు. ఆయన వయసు 95 ఏళ్లు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత 12 రోజులుగా ఐసీయులో ఉన్న దత్తాజీరావు ఈ తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబ సభ్యులు పీటీఐకి తెలిపారు. భారత మాజీ ఓపెనర్, జాతీయ కోచ్ ఔన్షుమాన్ గైక్వాడ్ […]
Another Student Dead in Rajasthan’s Kota: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఆత్మహత్యలకు అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. జేఈఈకి సిద్ధమవుతోన్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ఏడాదిలో ఇది నాలుగో మరణం. విద్యార్థుల వరుస ఆత్మహత్యలు అందరినీ కలవరపెడుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… ఝార్ఖండ్‌కు చెందిన శుభ్ చౌధరీ రెండేళ్లుగా జేఈఈకి […]
Farmers begins Delhi Chalo March: పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడం, 2020-21 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంట్ వరకు ర్యాలీ (ఢిల్లీ చలో) చేపట్టేందుకు పలు రైతు సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సోమవారం రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన కీలక సమావేశం ఎలాంటి తీర్మానం లేకుండా ముగియడంతో.. ఢిల్లీ చలో మార్చ్‌ను రైతులు మంగళవారం ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు పంజాబ్‌లోని ఫతేగఢ్ […]
Is Ishan Kishan Set to Be Released from BCCI Central Contract: గతేడాది డిసెంబర్ నుంచి టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్.. సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి వచ్చాడు. అప్పటినుంచి బీసీసీఐ, భారత జట్టు మేనెజ్మెంట్తో టచ్‌లో లేడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఇషాన్ అందుబాటులో ఉంటాడనుకున్నా.. అది జరగలేదు. చివరి మూడు […]
Sanjana Ganesan Body-Shamed On Valentine’s Day Post: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సతీమణి, స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ ఓ నెటిజన్‌పై ఫైర్ అయ్యారు. మహిళ శరీరాకృతిపై కామెంట్లు చేయడానికి ఎంత ధైర్యం?, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని మండిపడ్డారు. సంజనా ఇలా ఫైర్ అవ్వడానికి కారణం ‘బాడీ షేమింగ్’. సంజనా తన శరీరాకృతిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. కామెంట్ చేసిన నెటిజన్‌కు ఆమె గట్టిగా బదులిచ్చారు. విషయంలోకి వెళితే… […]
Kulwant Khejroliya picks 4 wickets in 4 balls: భారత బౌలర్, మధ్యప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కుల్వంత్ కేజ్రోలియా రికార్డుల్లోకెక్కాడు. రంజీల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా హోల్కర్ స్టేడియం వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో కుల్వంత్ ఈ రికార్డు నెలకొల్పాడు. బరోడా సెకండ్ ఇన్నింగ్స్ 95వ ఓవర్లో కుల్వంత్ ఈ ఘనతను […]
Najmul Hossain Shanto is Bangladesh New Captain: బంగ్లాదేశ్ కొత్త కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఎంపికయ్యాడు. మూడు ఫార్మాట్లలో శాంటోకు జట్టు పగ్గాలను అప్పగిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సోమవారం నిర్ణయం తీసుకుంది. తదుపరి 12 నెలలు బంగ్లా కెప్టెన్‌గా శాంటో ఉంటాడని బీసీబీ ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ పపోన్ తెలిపారు. ఈ 12 నెలలు శాంటో సారథిగా తానేంటో నిరూపించుకుంటే.. ఆ తరువాత కూడా కొనసాగే అవకాశం ఉంది. […]
Farmers Delhi Chalo March Today: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్ల పరిష్కారం కోసం రైతు సంఘాలు మంగళవారం దేశ రాజధానిలో ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. ఢిల్లీ చలో మార్చ్ నేపథ్యంలో హస్తినలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020-21 మధ్య ఏడాదికి పైగా సాగిన రైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని.. ఢిల్లీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రైతులు […]
KL Rahul Ruled Out Of IND vs ENG 3rd Test: ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టుకు టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో.. రాహుల్‌ను మూడో టెస్టు నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రాహుల్ స్థానంలో కర్ణాటక లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను జట్టుకు ఎంపిక చేసింది. మొదటి టెస్ట్ ఆడిన రాహుల్.. గాయం కారణంగా రెండో […]