Airtel Unlimited 5g Data Palns 2024: ప్రస్తుతం భారతీయ టెలికాం సంస్థలలో ఎయిర్టెల్, జియో, వీఐ మధ్యనే పోటీ ఉంది. పోటీలో భాగంగా వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ మూడు కంపెనీలు నిత్యం కొత్తకొత్త ప్లాన్స్ తీసుకొస్తున్నాయి. అయితే ఎయిర్టెల్, జియో ఇప్పటికే దేశ వ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తేగా.. వీఐ కూడా త్వరలోనే 5జీ సేవలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన పోటీదారులు ఎయిర్టెల్, జియోలు తమ వినియోగదారులకు అపరిమిత 5జీ డేటాను అందిస్తున్నాయి. […]
Australian Batsmen Harjas Singh form Chandigarh: సీనియర్ వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి 140 కోట్ల మంది భారతీయులను ఇంకా బాధిస్తుండగానే.. జూనియర్ ప్రపంచకప్‌లోనూ పరాజయం పలకరించింది. సీనియర్ జట్టును దెబ్బకొట్టిన ఆస్ట్రేలియానే.. జూనియర్ జట్టు విజయానికి అడ్డుపడింది. అండర్-19 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్‌ను ఓడించిన ఆసీస్ నాలుగోసారి ఈ ట్రోఫీని ముద్దాడింది. దాంతో ప్రపంచకప్‌లో సీనియర్లకు ఎదురైన పరభావానికి కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారని అంతా భావించినా.. నిరాశే ఎదురైంది. ఆసీస్ ఛాంపియన్‌గా నిలవడంలో […]
India Lost U19 World Cup Final to Australia: ఇటీవలి కాలంలో జరిగిన అన్ని ఐసీసీ ఈవెంట్ల ఫైనల్స్‌లో భారత్ పరాభవాలను ఎదుర్కొంది. 9 నెలల వ్యవధిలో మూడుసార్లు భారత్ ఓటములకు ఆస్ట్రేలియానే కావడం విశేషం. సీనియర్ స్థాయిలో అయినా, జూనియర్ టోర్నీలో అయినా ఆసీస్‌ను గెలవలేక భారత జట్లు చేతులెత్తేశాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్, అండర్-19 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్ విజయానికి ఆస్ట్రేలియా అడ్డుపడింది. […]
Qatar frees 8 Navy veterans: గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందిని ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సోమవారం తెల్లవారుజామున ఓ ప్రకటన విడుదల చేసింది. వీరికి విధించిన మరణశిక్షను ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చగా.. తాజాగా దాని నుంచి విముక్తి కల్పించి భారత్‌కు అప్పగించారు. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది మాజీ భారతీయ […]
Gold Price in Hyderabad on 2024 February 12: బంగారం ప్రియులకు శుభవార్త. పెళ్లిళ్ల సీజన్ ముందు పసిడి ధరలు దిగొస్తున్నాయి. గత 10 రోజులుగా బంగారం ధరలు (ఒక్క రోజు తప్పితే) తగ్గుతూ వస్తున్నాయి. నేడు బంగారం ధరలు అత్యంత స్వల్పంగా రూ.10 తగ్గాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (ఫిబ్రవరి 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690గా ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల ధర రూ.62,940 […]
Ravi Shastri Recalls Virat Kohli Test Captaincy: భారత జట్టుకు ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే తన దృష్టి విరాట్ కోహ్లీపై పడిందని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. భవిష్యత్తులో నువ్ కెప్టెన్సీ చేపట్టాల్సి ఉంటుందని, ప్రతి అంశాన్నీ పరిశీలించు అని కోహ్లీతో చెప్పినట్లు రవిశాస్త్రి పేర్కొన్నాడు. అప్పటికి విరాట్ తనకు ఇంకా సానబెట్టని వజ్రంలా కనిపించాడని చెప్పాడు. భారత జట్టు డైరక్టర్‌గా 2014లో రవిశాస్త్రి సేవలందించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు హెడ్ […]
MS Dhoni New CSK Jersey Goes Viral: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఎడిషన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త స్పాన్సర్ వచ్చింది. యూఏఈ చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్.. సీఎస్కేతో ఒప్పందం కుదుర్చుకుంది. చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ భాగస్వామ్యానికి సంబధించిన జెర్సీని ఆవిష్కరించారు. ముందుగా చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ జెర్సీని లాంచ్ చేశారు. కెప్టెన్ కూల్ ఈవెంట్లో భాగం కాలేదు కానీ.. అతని జెర్సీని మాత్రం […]
అమెరికాలో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన వారిపై వరుసగా దాడులు జరగడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. వీధి గొడవలో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త మృతి చెందారు. ఈ ఘటన ఫిబ్రవరి 2న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు వెల్లడించిన వివరాల ఇలా ఉన్నాయి. […]
ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ముందే అనుకున్నట్లుగానే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ దూరమయ్యాడని, అతడి నిర్ణయాన్ని తాము గౌరవిస్తాం అని బీసీసీఐ తెలిపింది. మొదటి రెండు టెస్టు మ్యాచ్‌లకు విరాట్ ఎంపికయినా.. ఆపై తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌లకు విరాట్ దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ […]
Mithun Chakraborty was admitted in hospital in Kolkata: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం ఛాతీ నొప్పితో బాధపడిన ఆయన కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం మిథున్ చక్రవర్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో.. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మిథున్ చక్రవర్తికి ఇటీవలే ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు […]