Bangladesh Captain: షకీబ్ అల్ హసన్ బిజీ.. బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Najmul Hossain Shanto is Bangladesh New Captain: బంగ్లాదేశ్ కొత్త కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఎంపికయ్యాడు. మూడు ఫార్మాట్లలో శాంటోకు జట్టు పగ్గాలను అప్పగిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సోమవారం నిర్ణయం తీసుకుంది. తదుపరి 12 నెలలు బంగ్లా కెప్టెన్‌గా శాంటో ఉంటాడని బీసీబీ ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ పపోన్ తెలిపారు. ఈ 12 నెలలు శాంటో సారథిగా తానేంటో నిరూపించుకుంటే.. ఆ తరువాత కూడా కొనసాగే అవకాశం ఉంది.
టెస్టు, టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రాజకీయాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన షకీబ్ రీఎంట్రీపై అనిశ్చతి నెలకొంది. మరోవైపు అతడు కంటి సమస్యతో కూడా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న శ్రీలంక సిరీస్‌కు షకీబ్ దూరమయ్యాడు. సీనియర్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా.. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతాడో లేదో అన్నది తెలియదు. వన్డే ప్రపంచకప్ 2023కు ముందు వన్డే కెప్టెన్సీ నుంచి తమీమ్ తప్పుకోగా.. షకీబ్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. ప్రపంచకప్ అనంతరం షకీబ్ కూడా వన్డే, టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పి.. టెస్టుల్లో మాత్రమే కొనసాగతానని తెలిపాడు. షకీబ్ ఇప్పటిలో రీ ఎంట్రీ ఇచ్చేలా లేదు. ఈ నేపథ్యంలోనే శాంటోను అన్ని ఫార్మట్లలో కెప్టెన్‌గా బీసీబీ నియమించింది.
Also Read
- Ragiri Satyanarayana: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ డీఈఈ సత్యనారాయణ గౌడ్ అరెస్ట్
- Best Wood for Furniture: ఇంటి ఫర్నీచర్‌కు ఏ కలప బెస్ట్? టేకు నుంచి శీశం వరకు.. చెదలు పట్టకుండా ఏం చేయాలి?
- Bharat Summit 2026: నేటి నుంచే భాగ్యనగరంలో ‘భారత్ సమ్మిట్’.. 70కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు..
- Delhi Air Pollution: ఊపిరి పీల్చుకోవడమే కష్టం.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి కాలుష్యం
Also Read: Former Protest Delhi: నేడు రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్.. సరిహద్దుల్లో బారికేడ్లు, కంచెలు!
నజ్ముల్ హొస్సేన్ శాంటో గతంలో బంగ్లాకు కెప్టెన్‌గా చేశాడు. గతేడాది సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జట్టుకు సారథ్యం వహించాడు. అతడి నాయకత్వంలోని బంగ్లా సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. అంతకుముందు వన్డే ప్రపంచకప్ 2023లోనూ షకీబ్ గైర్హజరీలో శాంటో జట్టు పగ్గాలు అందుకున్నాడు. శాంటో సారథ్యంలో బంగ్లా 11 మ్యాచ్‌లు ఆడి.. మూడు గెలిచింది. సొంతగడ్డపై మార్చిలో శ్రీలంక సిరీస్‌తో (మూడు టీ20లు, మూడు వన్డేలు) బంగ్లా పూర్తిస్థాయి కెప్టెన్‌గా శాంటో ప్రయాణం ఆరంభంకానుంది. శాంటో బంగ్లా తరపున 25 టెస్టులు, 42 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. ఇక కొత్త చీఫ్ సెలెక్టర్‌గా గాజీ అష్రఫ్ హుస్సేన్‌ను బీసీబీ నియమించింది.
తాజావార్తలు
-
Kiran Abbavaram: వారి కోసమే ‘రియాలిటీ’ మూవీ చేశా.. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు!
-
Ragiri Satyanarayana: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ డీఈఈ సత్యనారాయణ గౌడ్ అరెస్ట్
-
Best Wood for Furniture: ఇంటి ఫర్నీచర్‌కు ఏ కలప బెస్ట్? టేకు నుంచి శీశం వరకు.. చెదలు పట్టకుండా ఏం చేయాలి?
-
Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకాన్ని తగలబెట్టి.. 1984 సిక్కు అల్లర్ల బాధిత కుటుంబాల నిరసన
-
Ishan Kishan: టీమిండియాలోకి రావడం చాలా సంతోషంగా ఉంది.. నా టార్గెట్ అదే!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!