Sanjana Ganesan Body-Shamed On Valentine’s Day Post: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సతీమణి, స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ ఓ నెటిజన్‌పై ఫైర్ అయ్యారు. మహిళ శరీరాకృతిపై కామెంట్లు చేయడానికి ఎంత ధైర్యం?, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని మండిపడ్డారు. సంజనా ఇలా ఫైర్ అవ్వడానికి కారణం ‘బాడీ షేమింగ్’. సంజనా తన శరీరాకృతిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. కామెంట్ చేసిన నెటిజన్‌కు ఆమె గట్టిగా బదులిచ్చారు. విషయంలోకి వెళితే…
ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సంజనా గణేశన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రమోషన్ వీడియో పోస్ట్ చేశారు. ఓ ప్రముఖ కంపెనీకి చెందిన యాడ్‌లో సంజనాతో పాటు జస్ప్రీత్ బుమ్రా కూడా నటించాడు. సంజనా శరీరాకృతిపై ఓ నెటిజన్ ట్రోలింగ్ (బాడీ షేమింగ్) చేశాడు. ‘మీరు చాలా లావుగా కనిపిస్తున్నారు’ అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంజనా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ‘స్కూల్లో సైన్స్ పుస్తకాల్లో మీరు చదువుకున్న విషయాలు గుర్తులేవా?. మహిళ శరీరాకృతిపై కామెంట్లు చేయడానికి ఎంత ధైర్యం?. ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని రిప్లై ఇచ్చారు. సంజనా సమాధానంపై నెట్టింట పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Also Read: Ranji Trophy 2024: 4 బంతుల్లో 4 వికెట్లు.. రికార్డుల్లోకెక్కిన భారత బౌలర్!
స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్, క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాలు 2021 మార్చిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2023 సెప్టెంబరులో సంజనా మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆమె కుమారుడితో సరదా సమయం గడుపుతున్నారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో స్వల్ప విరామం దొరకడంతో బుమ్రా ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నాడు. త్వరలోనే భారత జట్టుతో చేరనున్నాడు. రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ఆరంభం అయ్యే మూడో టెస్టు మ్యాచ్‌లో బుమ్రా ఆడేది అనుమానంగానే ఉంది.