PM Modi Speech in Adilabad: తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం సహకరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. పేదలు, దళితుల అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు చేపట్టిందని.. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలు నిదర్శనం అని అన్నారు. ఆదిలాబాద్‌లో రూ.7వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జాతికి […]
PM Modi unveils projects worth 56000 Crore in Telangana: తెలంగాణలో 56 వేలకోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం రామగుండం ఎన్టీపీసీ రెండో యూనిట్‌ను ఆరంబించారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణకు 85 శాతం విద్యుత్ సరఫరా అవుతుంది. ప్రధాని ఆరంభించిన ప్రాజెక్టులలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో తెలంగాణను కలిపే రెండు హైవే […]
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులను హతమార్చిన ఓ తండ్రి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత గ్రామంలో అప్పులు ఎక్కువ కావడంతో మనోవేదానికి గురైన అతడు.. పిల్లలను చంపి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామంలో రవి (35) అనే వ్యక్తి జీఎస్ఎన్ ఫౌండేషన్ పేరుతో మనీ స్కాం […]
KTR React on LRS: మార్చి 6వ తేదీలోగా తెలంగాణ ప్రభుత్వం దిగిరాక పోతే తాము న్యాయ పోరాటం చేస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటపై కాంగ్రెస్ నేతలు ఎందుకు కట్టుబడి లేరని ప్రశ్నించారు. మార్చ్ 31 లోపు ఎల్ఆర్ఎస్ కట్టమని ఎందుకు అంటున్నారు?, 20 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై వేసేందుకు సిద్ధం అయ్యారు అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ను […]
తెలంగాణాలో అన్ని రంగాల కంటే అత్యధిక ప్రాధాన్యత విద్యకే ఇస్తాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్పొరేట్ స్కూల్‌కి మించి మనం పోటీపడాలని విద్యార్థులతో ఆయన అన్నారు. ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమం ద్వారా అమీర్పెట్ డీకే రోడ్డులోని గర్ల్ ప్రైమరీ స్కూల్ & హై స్కూల్లలో రెనోవేశన్ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక […]
Gachibowli Radisson Hotel Drugs Case Updates: హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో నిందితులుగా ఉన్న నటి లిషి, సందీప్‌లు ఆదివారం రాతి గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యారు. పోలీసులు ఇద్దరి నుంచి యూరిన్, బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించారు. వైద్య పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆ శాంపిల్స్‌ని పంపారు. ఫోరెన్సిక్ ఫలితాల కోసం గచ్చిబౌలి పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నటుడు నీల్ పరారీలో ఉన్నాడు. అతడు అమెరికా పారిపోయినట్లు […]
Devon Conway To Miss IPL 2024 Due to injury: ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. చెన్నై స్టార్ ఓపెనర్, న్యూజీలాండ్ క్రికెటర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఐపీఎల్ 17 సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ఎడమ బొటన వేలికి శస్త్రచికిత్స అవసరం అని వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్స అనంతరం అతడికి 8 వారాలు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ విషయంపై అధికారిక ప్రకటన […]
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాటను మరోసారి నిలబెట్టుకున్నారు. చిన్నారులు సోషల్ మీడియాలో పంపిన ఆహ్వానానికి ఫిదా అయిన కేటీఆర్.. ఆదివారం పాఠశాల వార్షికోత్సవానికి వెళ్లి వారిని ఆనందపరిచారు. తనకు వీడియో ద్వారా ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన చిన్నారులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తనతో పాటు సోఫాలో కూర్చొబెట్టుకుని మరీ కాసేపు ముచట్లు చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకొని సంతోషం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్‌లోని హైదరాబాద్ మిలీనియం పాఠశాల మూడో వార్షికోత్సవం […]
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం పెద్ద ఎత్తున కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా తూర్పు నియోజక వర్గంలో 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి.. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ […]
Minister Seethakka Visits Utnoor Ashram School: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సందర్శించారు. ఆదివారం రాత్రి ఆశ్రమ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అంతేకాదు ప్రతి గదికి వెళ్లి అక్కడి సదుపాయాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి.. అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆత్రం సుగుణ, తదితరులు పాల్గొన్నారు. […]