PM Modi Adilabad Schedule Today: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. వీటిలో ఎక్కువగా విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ పర్యటన సందర్భంగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. తెలంగాణని 17 ఎంపీ సీట్లకు గాను ఇప్పటికే 9 మంది అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని […]
5 Dead in Kothakota Road Accident: వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తకోట బైపాస్ టేక్కలయ్య దర్గా సమీపంలో 44వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. హాస్పిటల్ కు తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా […]
Rajahmundry MP Margani Bharath Comments: గుంటనక్కలు కాసుకుని కూర్చున్నారని, ప్రజలు గమనించి ఓటేయాలని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రేపు రాజమండ్రిలో లోకల్‌గా సిద్దం కార్యక్రమాన్ని సుబ్రమణ్యం మైదానంలో ఏర్పాటు చేశామని, రాజమండ్రి ప్రజల అభివృద్ధికి తాము సిద్దం అని అన్నారు. 10 వేల మందితో సిద్దం సభ జరగబోతోందన్నారు. రాజమండ్రిలో టీడీపీ చేసిన ఒక అభివృద్ధి చెప్తారా?, 16 ఏళ్లు పదవిలో ఉండి ఏ సాధించాలో చెప్పాలి అని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. […]
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా వలసలు జరుగుతున్నాయి. టికెట్ దక్కనివారు పక్క పార్టీల వైపు చుస్తున్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ తీర్థం పచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వసంతతో పాటు మైలవరానికి చెందిన చాలామంది టీడీపీలో చేరారు. వసంత కృష్ణ ప్రసాద్ ఎంట్రీతో మైలవరంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావులు మైలవరం టికెట్ ఆశిస్తున్నారు. ఇంతలో టీడీపీలోకి […]
Visakha MP Seat Competition in BJP: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ దేశవ్యాప్తంగా రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలెక్షన్స్ కూడా ఉన్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. కొన్నిచోట్ల సీట్ కోసం కీలక నేతలు కన్నేశారు. అందులో ఒకటి విశాఖ సీట్. ఈ సీట్ కోసం బీజేపీలో రోజురోజుకి పోటీ పెరుగుతోంది. విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ ఎంపీ సీఎం […]
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 2014లో వంద పేజీల మానిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారని, ఎన్నికలు పూర్తవగానే ఆ మానిఫెస్టోను వెబ్ సైట్ నుండి తొలగించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇప్పుడు ప్రజలు ఎవ్వరూ చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు.. అయన ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తారా? అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. Also Read: Kakani Govardhan […]
సొంత నియోజకవర్గమైన చంద్రగిరి వదిలి కుప్పంకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సొంత ప్రాంతంలో గెలవలేని వ్యక్తి.. వైసీపీ నేతలను మాత్రం ఇక్కడ తంతే అక్కడ పడ్డారని విమర్శిస్తున్నారు అని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత ప్రాంతం ఏది, గాజువాకకు ఎందుకు వెళ్లారు? అని మంత్రి కాకాణి ప్రశ్నించారు. పవన్ ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పు లేకుండా ఉన్నాడని, సొంతంగా రాలేక అందర్నీ కలుపుకొని ఎన్నికలకు […]
ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగిందని, అందుకే బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న పథకాలే తమకు అందుతున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. మహిళల సాధికారిత కోసం ప్రధాని మోడీ అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 18 వేల గ్రామాలకు విద్యుత్ లేకపోతే మోడీ భర్తీ చేశారని పురందేశ్వరి చెప్పారు. బీజేపీలో చేరిన వారు పార్టీలో చురుకుగా పని చేయాలని, కండువా […]
Nathan Lyon Creates History in WTC: వెల్లింగ్టన్లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఆసీస్ 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆసీస్ విజయంలో స్పిన్నర్ నాథన్ లియోన్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో లియోన్ 10 వికెట్స్ పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్స్ పడగొట్టిన లియోన్.. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు […]
Chittoor Ex MLA CK Babu meeting with followers Today: పార్టీలు రారా రమ్మంటున్నాయ్.. అనుచరులు రావాలంటూ ఓత్తిడి చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఇన్నాళ్లూ సైలెన్స్ ప్లీజ్ అంటూ వచ్చారు. చివరకు మౌనం వీడనున్నారు. ఆయన మరెవరో కాదు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మళ్లీ రంగంలోకి దిగనున్నారు. మరి కాసేపట్లో సీకే బాబు తన అనుచరులతో కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం తన […]