రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులను హతమార్చిన ఓ తండ్రి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత గ్రామంలో అప్పులు ఎక్కువ కావడంతో మనోవేదానికి గురైన అతడు.. పిల్లలను చంపి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామంలో రవి (35) అనే వ్యక్తి జీఎస్ఎన్ ఫౌండేషన్ పేరుతో మనీ స్కాం నిర్వహించాడు. 58 రోజుల్లో కట్టిన నగదుకు ఐదు రెట్లు ఎక్కువగా వస్తాయని చెప్పి టంగుటూరుతో పాటు ఇతర గ్రామాల ప్రజలతో స్కీములు కట్టించాడు. 58 రోజులకు వెయ్యికి ఐదు వేలు, లక్షకు 5 లక్షలు ఇప్పిస్తానంటూ ఇరుగు పొరుగు గ్రామ ప్రజలను నమ్మించి.. పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించాడు. గత ఏడాదిగా ఫౌండేషన్ నుండి డబ్బులు రాకపోవడంతో రవి తిరిగి చెల్లించలేకపోయాడు.
Also Read: KTR: 6వ తేదీలోగా ప్రభుత్వం దిగిరాక పోతే.. న్యాయ పోరాటం చేస్తాం: కేటీఆర్
డబ్బులు కావాలంటూ గ్రామస్తులు రవిపై ఒత్తిడి తెచ్చారు. అప్పులు తట్టుకోలేక శంకర్‌పల్లికి రవి కుటుంబం షిఫ్ట్ అయింది. ఆదివారం భార్యాభర్తల మధ్య గొడవ జరగడం, డబ్బుల చెల్లింపుపై ఒత్తిడి రావడంతో రవి తీవ్ర మనోవేదనకి గురయ్యాడు. అనుమానం భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలన్నాడు. శంకర్‌పల్లి నుంచి ముగ్గురు పిల్లలతో స్వగ్రామం టంగుటూరుకు చేరుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున ముగ్గురిని పిల్లల్ని చంపి.. ఉరివేసుకొని రవి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య శ్రీలత, కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న మోకిలా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.