KTR: 6వ తేదీలోగా ప్రభుత్వం దిగిరాక పోతే.. న్యాయ పోరాటం చేస్తాం: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR React on LRS: మార్చి 6వ తేదీలోగా తెలంగాణ ప్రభుత్వం దిగిరాక పోతే తాము న్యాయ పోరాటం చేస్తాం అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటపై కాంగ్రెస్ నేతలు ఎందుకు కట్టుబడి లేరని ప్రశ్నించారు. మార్చ్ 31 లోపు ఎల్‌ఆర్‌ఎస్ కట్టమని ఎందుకు అంటున్నారు?, 20 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై వేసేందుకు సిద్ధం అయ్యారు అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కేటీఆర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్ పైన కాంగ్రెస్ వైఖరి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. గతంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం మా ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. కేవలం రూ.1000తో రిజిస్టర్ చేశాము. ఆ రోజు మమ్మల్ని తప్పుపడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టుకు వెళ్లారు. ఆనాడు సీఎల్పీ నాయకుడిగా బట్టి విక్రమార్క ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించవద్దు అన్నారు. నో ఎల్‌ఆర్‌ఎస్-నో టీఆర్‌ఎస్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటపై ఎందుకు కట్టుబడి లేరు’ అని ప్రశ్నించారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
‘మార్చ్ 31 లోపు ఎల్‌ఆర్‌ఎస్ కట్టమని ఎందుకు అంటున్నారు. 20 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై వేసేందుకు సిద్ధం అయ్యారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు వసూలు చేసి భారం మోపుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే విరమించుకోవాలి. ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలి. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌పై వైఖరిని మార్చుకోవాలి. 6వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాకు పిలుపు ఇస్తున్నాం. ఎల్‌ఆర్‌ఎస్ రద్దు కోసం హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తాం. ఆరోజు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ నిరసనలు ఉంటాయి. ఏడో తేదీన కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తాం’ అని కేటీఆర్ చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!