IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devon Conway To Miss IPL 2024 Due to injury: ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. చెన్నై స్టార్ ఓపెనర్, న్యూజీలాండ్ క్రికెటర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఐపీఎల్ 17 సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ఎడమ బొటన వేలికి శస్త్రచికిత్స అవసరం అని వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్స అనంతరం అతడికి 8 వారాలు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో డెవాన్ కాన్వే ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా కాన్వేను స్కానింగ్‌కు తరలించగా.. ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. వైద్యులు అతడికి సర్జరీ అవసరమని సూచించారు. కాన్వే చేతి వేలికి త్వరలోనే శస్త్రచికిత్స జరగనుంది. శస్త్రచికిత్స అనంతరం అతడికి 8 వారాల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పారు. దాంతో మే వరకు కాన్వే ఆటకు దూరమవుతాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 మొత్తానికి అతడు దూరం కానున్నాడు.
Also Read
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
Also Read: KTR: చిన్నారుల ఆహ్వానం.. పాఠశాల వార్షికోత్సవానికి వెళ్లిన కేటీఆర్!
ఐపీఎల్ 2023 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంలో డెవాన్ కాన్వే పాత్ర కీలకం. ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్’గా కాన్వే నిలిచాడు. కాన్వే దూరమవడం చెన్నైకి భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. గత సీజన్‌లో 16 మ్యాచ్‌లలో 672 పరుగులు చేశాడు. అందులో ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి. 2022లో మెగా వేలంలో బేస్ ధర రూ.1 కోటికి న్యూజిలాండ్ స్టార్ కాన్వేను చెన్నై తీసుకుంది. 23 మ్యాచ్‌లు ఆడిన అతను 9 అర్ధ సెంచరీలతో 924 పరుగులు చేశాడు. చెన్నై తమ తొలి మ్యాచ్‌లో మార్చి 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చిదంబరం స్టేడియంలో తలపడనుంది.
తాజావార్తలు
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!