ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో దక్షిణాఫ్రికా ఊహించని విజయాలు అందుకుంటోంది. భారత్‌తో మ్యాచ్‌లో ఓటమి తప్పదనుకున్న స్థితిలో గొప్పగా పోరాడిన దక్షిణాఫ్రికా.. బంగ్లాదేశ్‌పై కూడా అలాగే ఆడి గెలిచింది. 233 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచన నిలిచిన ప్రొటీస్.. చివరికి 3 వికెట్ల తేడాతో గెలిచింది.చోలే ట్రైయాన్ (62), నదైన్ డిక్లెర్క్ (37) మరోసారి మెరవడంతో దక్షిణాఫ్రికా అనూహ్య విజయాన్ని అందుకుంది. ప్రొటీస్ టీమ్ […]
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా వన్డే ప్రపంచకప్ 2027ను అక్టోబర్-నవంబర్లలో నిర్వహిస్తాయి. 2003 తర్వాత దక్షిణాఫ్రికా, జింబాబ్వే కలిసి మెగా టోర్నమెంట్‌ను నిర్వహించడం ఇది రెండోసారి. ఈ టోర్నీలో టీమిండియా స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇద్దరు ప్రపంచకప్‌లో ఆడుతారని కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ హింట్ ఇచ్చినా.. అందరికి అనుమానాలే ఉన్నాయి. వీరితో పాటు మరో ముగ్గురు కూడా మెగా టోర్నీలో ఆడడం డౌటే అని తెలుస్తోంది. రోహిత్ శర్మ: 1987లో […]
దీపావళి 2025కి ముందుగానే ‘అమెజాన్’ ఇండియా ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. అమెజాన్ సైట్ బ్యానర్‌పై లిస్ట్ చేయబడిన వివరాల ప్రకారం.. సేల్ సమయంలో 80 శతం వరకు తగ్గింపులు లభించనున్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు సహా దీపావళి గిఫ్ట్‌లపై అనేక ఆఫర్లు ఉన్నాయి. సెప్టెంబర్ 23న ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇప్పుడు.. దీపావళి స్పెషల్‌గా వచ్చింది. దీపావళి స్పెషల్ సేల్‌లో డీల్స్, డిస్కౌంట్లు సవరించబడ్డాయి. దీపావళి బహుమతులు, ఇతర వస్తువులపై […]
‘కర్వా చౌత్’ రోజు ఉత్తర భారతదేశంలోని వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం ఉండగా.. యూపీలోని అలీఘర్‌లో మాత్రం ఉహించని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కర్వా చౌత్ రాత్రి నూతన వధువులు జల్లెడలో చంద్రుడిని చూసి తమ భర్తలకు హారతి ఇచ్చి.. కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన ఆహరం పెట్టారు. అందరూ మత్తులోకి జారుకున్నాక ఇంటిలోకి డబ్బు, నగలను తీసుకుని పారిపోయారు. ఇలా జరిగింది ఒక ఇంట్లో కాదు.. ఏకంగా 12 ఇళ్లలో జరిగింది. […]
Gold Price Hike Today in Hyderabad: భారతీయులు పసిడి ప్రియులు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేసి ధరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పండగలు, వేడుకలు, శుభకార్యాల వేళ బంగారంకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో పండగలు, శుభకార్యాలతో సంబంధం లేకుండా గోల్డ్ రేట్స్ భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆల్‌టైమ్ హై దాటేసి పరుగులు పెడుతోంది. బంగారం ధరలు రికార్డు […]
భారతదేశంలో ఇటీవలి సంవత్సరాలలో యువత గుండెపోటుకు ఎక్కువగా గురవుతన్నారు. ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్ కేసులు బాగా పెరిగాయి. వైద్యులు ఇందుకు పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, అధిక మద్యం సేవించడం, తీవ్ర ఒత్తిడి లాంటివి గుండెపోటుకు దారితీస్తాయి. గుండెను కాపాడుకోవడానికి ఆహారాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం అని వైద్యులు అంటున్నారు. గుండెపోటు ప్రమాదాన్ని పెంచే కొన్ని అనారోగ్యకరమైన అలవాట్లు ఏంటో చూద్దాం. ఉప్పు: ఉప్పు తీసుకోవడంను తగ్గించాలని […]
ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా సరికొత రికార్డు సృష్టించింది. ఆదివారం విశాఖపట్నంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి టీమిండియాను చిత్తు చేసింది. ఉత్కంఠభరిత పోరులో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ (142; 107 బంతుల్లో 21×4, 3×6) మెరుపు సెంచరీతో.. 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇది వన్డే చరిత్రలో అత్యధిక ఛేజింగ్. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే 331 పరుగులు సక్సెస్ఫుల్ రన్ ఛేజ్ […]
ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో వయసుతో సంబంధం లేకుండా ప్లేయర్లు వస్తున్నారు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ 2025లో వైభవ్ సంచలనం సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ (101; 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లు) ఆడిన తీరును ఎవరూ మర్చిపోలేరు. దూకుడైన ఆట తీరుతో ఎక్కడైనా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. సింగిల్స్ తీసినంతా ఈజీగా వైభవ్ సిక్సర్లు బాదేస్తున్నాడు. ఐతే యువ బ్యాటర్ వైభవ్ కెరీర్‌కు […]
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా పాకిస్థాన్ జట్టు తన తొలి సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. లాహోర్ వేదికగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజే పాకిస్థాన్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా కెప్టెన్ షాన్ మసూద్ (76), ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) అద్భుత హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి 25 ఏళ్ల నాటి అరుదైన రికార్డును సమం చేశారు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ కేవలం […]
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఈరోజు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) వేయనుంది. న్యాయ నిపుణుల సూచనలతో పిటిషన్ దాఖలుపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను సిద్ధంగా ఉంచారు. ఈ అంశంపై ఏజీ సుదర్శన్ రెడ్డి, సుప్రీం […]