వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా పాకిస్థాన్ జట్టు తన తొలి సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. లాహోర్ వేదికగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజే పాకిస్థాన్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా కెప్టెన్ షాన్ మసూద్ (76), ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) అద్భుత హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి 25 ఏళ్ల నాటి అరుదైన రికార్డును సమం చేశారు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ కేవలం […]
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఈరోజు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) వేయనుంది. న్యాయ నిపుణుల సూచనలతో పిటిషన్ దాఖలుపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను సిద్ధంగా ఉంచారు. ఈ అంశంపై ఏజీ సుదర్శన్ రెడ్డి, సుప్రీం […]
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ క్రికెట్ ఆటగాడు మైదానంలోనే మృతి చెందాడు. స్థానికంగా జరిగిన ఓ టోర్నమెంట్లో అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టును గెలిపించాడు కానీ.. జీవిత పోరాటంలో మాత్రం ఓడిపోయాడు. చివరి బంతి వేసిన తర్వాత ఆ బౌలర్ అకస్మాత్తుగా మరణించాడు. ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి వైరల్ అయింది. మొరాదాబాద్‌లోని బిలారి బ్లాక్‌లో ఉత్తరప్రదేశ్ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఓ టోర్నమెంట్‌ను నిర్వహించింది. బిలారిలోని చక్కెర […]
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగులను పూర్తి చేసింది. దాంతో మహిళల వన్డేల్లో ఒక క్యాలెండర్ ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో స్మృతి ఈ రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందు మరే ఇతర మహిళా క్రీడాకారిణి ఈ ఘనత సాధించలేదు. గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ […]
ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేసే ఛాన్స్ మిస్ అయ్యాడు. డబుల్ సెంచరీకి చేరువ అవుతున్న తరుణంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కారణంగానే రనౌట్ అయ్యాడు. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న గిల్ ముందుగా పరుగు తీయడానికి ఓకే అని.. తర్వాత వెనక్కి వెళ్లడంతో యశస్వి రనౌట్ అయిపోయాడు. దీంతో గిల్‌పై జైస్వాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ […]
లులూ మాల్ గొంతెమ్మ కోర్కెలపై కూటమి పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. ఏపీకి ఆహ్వానించిన ప్రభుత్వమే.. ఇప్పుడు లులూపై గుర్రుగా ఉంది. రాష్ట్రానికి తానే అవసరమన్న ధోరణిలో లులూ ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసంతృత్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లులూకు ప్రభుత్వం ఇచ్చే భూముల విలువ, రాయితీలు ఎన్ని?.. లులూ ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని? అని కేబినెట్లో డిప్యూటీ సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న లులూ.. తిరిగి ప్రభుత్వానికే షరతులు పెట్టడం […]
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలి ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణకు మాజీ సీఎం వైఎస్ జగన్ వల్ల ప్రాణ హాని ఉందన్నారు. ఇటీవల మండలిలో బొత్స పనితీరు బావుందని, ఇది జగన్‌కు నచ్చదు అన్నారు. గతంలో బాబాయ్‌కు జరిగినట్టే బొత్సకు కూడా జరగచ్చు అన్నారు పల్లా. ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రాణ హాని ఉండదన్నారు. బొత్స తనకు ప్రాణ హాని ఉందని చెప్పడంతో పల్లా శ్రీనివాస్ […]
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ‘వారాహి స్టూడియోస్’పై ప్రశంసలు కురిపించారు. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ కుమార్ తనకు బాగా కావాల్సిన వాడు అని తెలిపారు. మొదటిసారి వారాహి స్టూడియోస్‌లో తాను డబ్బింగ్ చెప్పానని, చాలా బాగా అనిపించిందన్నారు. వసంత్ దగ్గరుండి మరీ తనకు డబ్బింగ్, డైలాగ్స్ చెప్పించాడని చెప్పారు. ఇక్కడికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, వారాహి స్టూడియోస్ అధినేత వసంత్‌కు ఆల్ ది బెస్ట్ అని జగపతి బాబు పేర్కొన్నారు. ఎన్నో సినిమాలకు […]
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఏ1 నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జనార్దన్ కీలక వివరాలను వెల్లడించారు. జనార్ధన్ 2021 నుంచి నకిలీ మద్యం తయారీ వ్యాపారం చేస్తున్నారు. మొట్టమొదటిగా హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఒక గది అద్దెకి తీసుకొని అక్రమ మద్యం తరలించారు. మద్యాన్ని 35 […]
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొదటి రోజు సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీ ఉన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తా అని హామీ ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధిపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బందులేకుండా చూస్తా అని, ఆస్పత్రిలో ఉన్న పరికరాలతో పాటు మరిన్ని ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తామని బాలయ్య బాబు చెప్పారు. Also […]